పుట:Haindava-Swarajyamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

హైందవ స్వరాజ్యము.

వానికంటె మెరుగుగా నుండునని నమ్ముటకు రాదు. బీదభారతభూమి స్వతంత్రము కావచ్చును. కాని అవినీతిచే ఈ భూమి భాగ్యవంత మగునేని తరువాత స్వతంత్ర మగుట కష్టము. డబ్బుగలవారు బ్రిటిషుపరిపాలనను బలపరతురు. వారి లాభా లాభములు ఆ పరిపాలన లాభాలాభములతో మేళవమై యుస్నవి. డబ్బు మానవుని బలహీను నొనర్చును. స్త్రీలోలతయు తత్సమానము. రెండును విషమే. విష సర్పదష్టుడు ఈ రెంటి దాసునకంటె మేలు. ఏలయన, విషస్పర్శదేహమును మాత్రము నశింపజేయును. ఇయ్యవి దేహమును, మానసమును, ఆత్మను అన్నిటిని నశింపజేయును. కాబట్టి యంత్రాగారాభివృద్ధి యేదో లాభ మని మనము సంతసింప బనిలేదు.

చదువరి: అయిన యంత్రాగారములు మూయవలసిన దేనా?

సంపా: అది కష్టము. ఏర్పడినదానిని ఎత్తివైచుట సుకరము కాదు. కాబట్టి ప్రారంభింపకుండుటయే పరమవివేకము. యంత్రాగారాధిపుల ఖండింపరాదు. వారియెడ కరుణచూపనగు. యంత్రాగారములను వారు వదలవలె ననుట విపరీతము. వానిని పెంచకు డనిమాత్రము ప్రాధేయపడవచ్చును. వారు మంచివా రగుదు రేని తమ వ్యాపారమును కురుచచేయుచు వత్తురు. వేన వేలయిండ్లలో ప్రాచీనమగు నేతమగ్గమును నెలకొల్పి అందగు నుత్పత్తినంతయు వారు కొననగును. యం