పుట:Haindava-Swarajyamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యంత్రసామగ్రి

125

బంగాళము యంత్రసహాయమున సిద్ధమయిన యెల్లవస్త్రములను బహిష్కరించియుండిన బాగుండును.

యంత్రములు యూరోపును నశింపజేయ నారంభించినవి. ఆనాశము ఇంగ్లండుతలుపు దట్టుచున్నది. ఇప్పటి నాగరకమునకు యంత్రములు ముఖ్యచిహ్నములు. ఇవి పాప కారణములు.

బొంబయి వస్త్రయంత్రములలో పనిచేయువారలు దాసులైనారు. అచ్చట పనిచేయుస్త్రీలస్థితి మహా విషాదకరము. యంత్రశాలలు పుట్టకముందు ఈస్త్రీలు ఆకలికి మాడుచుండ లేదు. యంత్రములపిచ్చి మనదేశములో ప్రబలినయెడల ఇది యభాగ్యదేశము కాక మానదు. విపరీతముగా దోచవచ్చు నేమో కాని మనదేశములో యంత్రాగారములు పెంచుటకన్న మాంచెస్టరుకు ద్రవ్యముపంపి అచ్చటినుండి దిగుమతియగు పనికిరానిగడ్డలను ధరించుటే మేలు. మాంచెస్టరుగుడ్డ లుపయోగించుటవలన మనకు ద్రవ్యనష్టముమాత్ర మగుచున్న ది. మాంచెస్టరు నిచ్చట రూపుదాల్ప చేసితిమేని మన జాతీయ వంశమునకే ముప్పు వాటిల్లి మన నైతికజీవనమే నశింపగలదు. ఇందుకు తార్కాణము వలయునేని యంత్రాగారములలోని పనివారలనే సాక్ష్యమునకు కోరుచున్నాను. యంత్రాగారములమూలకముగా ధనము గడించినవారు ఇతర ధనవంతుల కంటె నెక్కువ మంచివారుగ నుండపోరు. రాక్కు ఫెల్లరు భారతభూమిలో పుట్టినంతమాత్రముచేత అమెరికాలో పుట్టిన