పుట:Haindava-Swarajyamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

హైందవ స్వరాజ్యము.

ఏవిషయము కాదు, ఏశాస్త్రము అవసరము ఏశాస్త్రము కాదు అనువిషయము లాలోచింపవలసి యుందుము. ఇంగ్లీషు పట్టములకు మన మెప్పుడు ఆశింపమో అప్పుడే మనపరిపాలకులు గాఢాలోచనపాలు గావలసియుందురు.

చదువరి: అయిన మన మేవిద్య నేరువవలెను ?

సంపా: మనభాష లన్నిటిని అభివృద్ధిచేయవలెను. ఇంగ్లీషులోని ఉత్తమగ్రంథములను ఇందులోనికి వ్రాయవలెను. శాస్త్రములన్ని నేర్చెద మనునటమును మానవలెను. నీతిమత బోధకు అగ్రస్థాన మీవలెను. విద్యావంతు డగుప్రతి హైందవుడు తనదేశభాష నెరుంగుటతోడగూడ హిందీ నేరువవలెను, దానితో గూడ హిందువైన సంస్కృతము, మహమ్మదీయుడైన అరబ్బీ అభ్యసింపవలెను. కొందరు హిందువులు అరబ్బీ నేర్చుటయు కొందరు మహమ్మదీయులు సంస్కృతము నేర్చుటయు అవసరము. హిందీ సామాన్యభాష కావలెను. దానికి లిపి నాగరీ పారసీలు ఇష్టానుసారము వాడవచ్చును. హిందూ మహమ్మదీయ సోదర భావము వృద్ధియగుటకు రెండులిపులును వాడుట యుత్తమము. ఇది చేయగలమేని ఇంగ్లీషుభాషను బహుత్వరలో ముఖ్యస్థానమునుండి కదల్చి వేయవచ్చును. బానిసలగు మనకు ఇదియంతయు నవసరము. మన బానిసము మన దేశ మంతయు బానిసమైనది. మన స్వాతంత్ర్యముతో దేశమంతయు స్వతంత్రము కాగలదు.