పుట:Haindava-Swarajyamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్య

121

లాయడుజార్జివేల్సుపిల్లలు వెల్గుభాష నే అభ్యసింపజేయ ప్రయత్నించుచున్నారు. మనగతి ? పత్రికలకు, సభలకు, ఉత్కృష్ట భావప్రకటనకు, తుదకు జాబులకు అన్నిటికి ఇంగ్లీ షే. ఇట్లే జరుగుచుపోయిన యెడల అచిరకాలములోనే మనసంతతివారు మనల శపించవలసి యుందురు.

నేను బారిస్టరు. కోర్టులో నే నింగ్లీ షే మాట్లాడవలె. నా ఇంగ్లీషును ఇంకొకరు నా మాతృభాషలోనికి తర్జుమా చేయవలసి యున్నది. ఇది దాస్యముకాదా? దీని కెన రుత్తర వాదులు? ఇంగ్లీషువారు కాదు. మనమే. భారతజాతిశాపములు వారికి దగులవు. మనకు తగులును.

ఈ ప్రశ్నకు అవును కాదని రెండురీతులు ప్రత్యుత్తర మిచ్చితిని. కాదనుటకు కారణములు నిరూపించితిని. ననుటకును కారణములను దెల్పెద. మనకు ఇప్పటి నాగరికము మిక్కిలి ఎక్కువగా పట్టుపడినది. కాబట్టి ఇంగ్లీషులను వెంటనే వీడిపోదు. ఇంగ్లీషువారు తమనాగరకము యెంత ఏవగించుకొనునది ఎరుంగుటకును ఇంగ్లీషు అవసరము ఇంగ్లీషుమూలకముగా ద్రవ్య మార్జింపవలె నను దురాశ త్రము మానితీరవలెను. ఇప్పు డింగ్లీషు నేర్చినవారు తమసంతతులకు జీవరహస్య జ్ఞానము నంతయు దేశభాషలమూలకముగా నేర్పవలెను. వారు పెద్దలైనప్పుడు ఇంగ్లీషు నేరువవచ్చును ఇట్లు మితముగా నేర్చుటలో కూడ ఏవిషయ మభ్యసనీయము