పుట:Haindava-Swarajyamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్య

119

గదా! దానికిగూడ నిప్పటివిద్య వలంతికాదు. పాశ్చాత్య నాగరికమోహముచే మన మీవిద్యను పట్టుకొని పెనగు చున్నాము.

ఉత్తమవిద్య యనునదియు మిథ్యయే. నేను భూగోళశా స్త్రము, ఖగోళశాస్త్రము, గణితశాస్త్రము, బీజగణితము, రేఖాగణితము అన్నియు నేర్చితిని. వీనిని నేనేమి యుపయోగించినాను? అవి యెందుకు పనికివచ్చినవి ? హక్‌స్లీపండితుడు విద్య నిట్లు వర్ణించినాడు. సంకల్పమున కనుగుణముగ సంతసమున సేవయొనర్చు శరీర మలవడునట్లు ఏవాడు బాల్యమున శిక్షనందినవాడో ఎవ్వనిబుద్ధి కుశాగ్రమయి శాంతమయి తేట యయి ప్రకాశించునో ఎవ్వనిమానసము స్వభావసిద్ధసూత్రముల గ్రహించినదో ఎవ్వనియింద్రియములు సుశిక్షతములైన మనస్సాక్షికి నిరంతర మడకువతో ప్రవర్తించునో ఎవ్వడు ఎల్ల నైచ్యమును నిరసించి ఇతరునింగూడ తన్ను బోలె గారవించునో వాడే విద్యావంతుడు.

ఇట్టివిద్య మన ప్రాథమికవిద్యాపద్ధతిలోను కానము. ఉత్తమవిద్యలోను కానము.

చదువరి: మీయుత్తమవిద్య మీకు ఫలమునియ్యనిచో ఇంతదూరము మీరు నాకు విమర్శించి చెప్పియుండజాలరు.

సంపా: నాకు ప్రాథమికవిద్యగాని ఉత్తమవిద్య కాని మా పెద్దలు నేర్పనియెడల నాజీవనము చెడిపోయి యుండజాలదు.