పుట:Haindava-Swarajyamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

హైందవ స్వరాజ్యము.

పదునెనిమిదవ ప్రకరణము.


విద్య.

చదువరి: ఇంత మాట్లాడితిమి. ముఖ్యమైనది విద్య. దాని సంగతి రాలేదు. బడోదా గైక్వాడు మహారాజు నిర్బంధోచిత ప్రారంభవిద్య పెట్టినాడు. మే మంద రాతనిని పూజించుచున్నాము. ఇదంతయు వ్యర్థమేనా.

సంపా: మహారాజు ఉత్తమోద్దేశమువాడు. కాని ఈ విద్యవలన ఫలముమాత్ర ముండదు.

విద్యయనగా అక్షరజ్ఞాన మగునేని అది యొకసాధనము. దానిని సద్వినియోగము చేయవచ్చును. దుర్వినియోగమును చేయవచ్చును. దుర్వినియోగము నే డెక్కువగనున్నది. కావున ఎక్కువగా నష్టముకలిగిన దనియే చెప్పతగియున్నది.

పిల్లలకు చదువు, వ్రాత, లెక్కలు నేర్పిన, అది విద్య యనుకొనుచున్నాము. రైతు కష్టపడి న్యాయముగా జీవనము చేయుచున్నాడు. సామాన్యలోకవ్యవహార మతనికి తెలుసును. అయిన అక్షరములు వ్రాయుటమాత్ర మతనికి రాదు. అక్షరములు నేర్పి అతనికి ఎక్కువ మ రేమి కలుగ జేయుచున్నారు. ఆతనిసౌఖ్యమున కొక్కలవము పెంపు గల్గింపగలరా? అనవసరాసంతుష్టిని పెంపొందించుటయే