పుట:Haindava-Swarajyamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

117

లగుచున్న వనుటయు స్పష్టమే. ఎప్పుడు భయమువీడునో అప్పుడు ఖడ్గ మాతనిచేతిని వదలిపోవును. దానిసహాయ మతనికి ననావశ్యము. వైరకల్మషము లేనివానికి ఖడ్గముతో పనిలేదు. ఒకానొకమనుష్యుడు దారినడచుచున్నాడు. అతని చేత కఱ్ఱ యున్నది. ఆకస్మికముగా సింహ మెదురుపడినది. నిరాలోచనమై ఆత్మసంరక్షణకై కఱ్ఱ నెత్తినాడు. ఆనిమేషముననే యొక భావ మాతని మనోవీథిని తోచినది. ధైర్యము లేకున్నను ధైర్య మున్నట్లు దంభములాడుకొని యుండుట స్మరణకు వచ్చినది. వెంటనే అతడు కఱ్ఱను క్రింద పడవైచినాడు. భయము పారిపోయినది.


___________