పుట:Haindava-Swarajyamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాత్త్విక నిరోధము

113

చిన్న సంస్థాన మొకటి కలదు. దాని యధిపతి యొక యాజ్ఞ పాలించెను. ఇది ప్రజలకు సమ్మతము కాలేదు. నాకు వెంటనే గ్రామమువదలి వలసపో నారంభించిరి. అధిపతి క ధైర్యము పుట్టెను. ప్రజలక్షమాపణను ఆతడు ప్రార్థించెను. తనయాజ్ఞ నుపసంహరించుకొనెను. ఇది నాజ్ఞాపకమున జరిగినసంగతి. ఇట్టి ఉదాహరణములు భారతచరిత్రమున నెన్ని యైనను కలవు. సాత్త్వికనిరోధము ప్రజలకు మహామంత్రముగా ఏర్పడినచోటనే నిజ మగు స్వరాజ్యము సాధ్యము. మరి యేసందర్భము పొసంగినను అది పరిపాలనయే కాని స్వరాజ్యము కాదు

చదువరి: అట్లైన కాయమును పోషించి శిక్షించుటయే యనవసరమా యేమి?

సంపా: అట్టిది నేనేమియు చెప్ప లేదు. కాయము శిక్షితమైనగాని సాత్త్వికనిరోధి యగుటకు వీలు లేదు. లౌల్యముచే డీలుపడినదేహము నాశ్రయించుమానసము బలవంతము కా జాలదు. మనోదౌర్బల్యము ఆత్మదౌర్బల్యమునకు కారణము. కాబట్టి బాల్యవివాహముల మానుటచేతను విషయలౌల్యమును వీడుటచేతను దేహపటుత్వము సంపాదింపవలసియుందుము. ఒక్కి కట్టెను ఫిరంగిగుండున కెర కమ్మని నే ప్రోత్స హింతునేని లోకమంతయు నను నవ్వుదురు.