పుట:Haindava-Swarajyamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

హైందవ స్వరాజ్యము.

రాజులు ఎప్పుడును రాజసాయుధములను వినియోగింతురు. పశుబలదీక్ష వారికి పట్టినది. వారు అధికార మొనర్ప నాలోచింతురు. అయిన అధికారమును శిరసా వహించువారలకు ఫిరంగు లక్కర లేదు. ఈ రెండవ తెగవారే లోకమున మహ త్సంఖ్యాకులు. వీరు దేహబలమో ఆత్మబలమో అభివృద్ధి చేయవలసియుందురు. దేహబల మభివృద్ధిచేయుచోట పరిపాలితులు పరిపాలకులు అందరు మతి భ్రష్టు లగుదురు. ఆత బల మభివృద్ధి చేయుచోట రాజులయాజ్ఞలు వారికత్తి మొనలదాటి వ్యాపింపవు. ఏలయన, నిజపౌరులు అన్యాయాజ్ఞల నుల్లంఘింతురు. రైతుల నే ఖడ్గమును లోబరచుకొని యెరుగదు. ఇకముందును లోబరుచుకొన జాలదు. వారికి ఖడ్గ ముపయోగించుట తెలియదు. ఇతరు లుపయోగించిన వారికి భయము లేదు. జాతస్యమృత్యుం ధృవ మ్మని కాలుని తలగడగా నిడి ఏజాతి ప్రవర్తించునో అది యుత్తమజాతి. కాలుని గణింపని నాడు భయమునకు తావే లేదు. పశుబలము యొక్క పంచ రంగులను పవిత్రముగా నెంచి మోహితులైనవారి కీవర్ణన మననార్హము. నిజ మేమన. భారతభూమిలో జీవితశాఖల నన్నింటను ప్రజ సాత్త్వికనిరోధము నవలంబించియే యున్న ది. పరిపాలకులు మన కనిష్ట మగు కార్యములను చేసినప్పుడు మనము వారి కలసి పనిచేయుట లేదు. ఇదియే. సాత్త్విక నిరోధము.