పుట:Haindava-Swarajyamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

దేశీయమహాసభ : తదధికారులు.

విద్యకయి ధారపోయునపుడు అట్టివారు ఈ దేశమున నెందరుం డిరో వ్రేలుమడిచి చెప్పగలరా ? గోకె లేమహాశయు డేమి చేసి నను సరియే పవిత్రోద్దేశముతోను మాతృ సేవాదృష్టిలోను చేసి నాడనుట నాదృఢవిశ్వాసము. అతని మాతృభక్తి యపారము. దేశమాతకు ప్రాణమైనను సమర్పించుట కతడు సంసిద్ధుడు. అత డేమి పల్కినను పరసంతోషమునకయి పలుకువాడు కాడు. తనకు న్యాయమని తోచినదే చెప్పువాడు. కాబట్టి యతని యెడల మనకు సంపూర్ణాదరము అత్యవసరము.


చదువరి: అట్లైన మన మతని పాదముల బట్టి యన్ని విషయ ములలోను నడువవలసిన దేనా ?


సంపా : నే నామాట చెప్పనే లేదు. ఎందులో నైనను మన యాత్మసాక్షి ఆతని పథమునుండి వేరుపడెనా అప్పుడు తదను గుణముగా నడువవలసినదేయని అతడే మనకు బోధించియుం డును. అతడు చేసిన పనిని దూరకుండ, ఆతనితో పోల్చుకొను నెడల మనము మిక్కిలి యల్పజ్ఞులమగుటను స్మరించుకొను టయే మనము చేయవలసినది. అనేకులు వ్రాయసకాండ్రు అత నిని ఉల్లంఘించి వ్రాయుదురు. ఆవ్రాతలకు మనము అసమ్మతి దెల్పుట కరణీయము. గోకెలే మహానుభావునివంటివారలను మనము స్వరాజ్య సౌధము యొక్క ముఖ్యస్తంభములుగా నాలో చింపవ లెను. మనమాట బంగారుమాట, ఇతరులమాట వృధ