పుట:Haindava-Swarajyamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

హైందవ స్వరాజ్యము.

నేను లోబడనని తెలిపి అది విధించుశిక్షల ననుభవింతు నేని అది ఆత్మబలోపాయ మగును. దీనికి ఆత్మత్యాగ మవసరము.

అందరును ఇతరులను బాధపెట్టుటకన్న ఆత్మత్యాగము మహోత్తర మని యంగీకరించుచున్నారు. అంతేకాక న్యాయముకాని విషయములలో ఈశక్తి నుపయోగించినను ఉపయోగించువా డొక్కరుడే నష్టపడును. అతనితప్పుమై ఇతరులను బాధపెట్టినవాడు కాడు. ఇదివరలో మానవు లెన్నియోపనులు చేసినారు. అందులో ననేకములు తప్పనుట తరువాత బయల్పడినది. ఏమానవుడును సంపూర్ణత్వమును ఆరోపించుకొనరాదు. ఎప్పుడును తనయభిప్రాయమే సంపూర్ణముగా ననుకరణీయ మనరాదు. ఎవ్వడును ఇదితప్పు ఇది నిజ మని అచలసిద్ధాంతము చేయరాదు. తనయలోచనకు తప్పనితోచినది తనమట్టుకు తప్పే, సందియములేదు. అందు చేతనే తనకు దోష మని తోచినది యెవ్వడును చేయరాదు. అందువలన కలుగుఫలము ఎట్టిదైనను అనుభవింపవలసినది. ఇదియే యాత్మశ క్తికి మూలాధారము.

చదువరి: అట్లైన మీరు శాసనముల నుల్లంఘింతురా ? అది రాజభక్తికి మహావ్యతిరేకము. మనమెల్ల కాలము న్యాయ బద్ధుల మనుకీర్తి గడించినాము. మీరు అతివాదులను మించిపోవున ట్లున్నారు. వారు చెప్పున దేమి ? ఎట్టిశాసనములకును. మనము బద్ధులము గావలెను. అవి చెడ్డవియైనవి యగు