పుట:Haindava-Swarajyamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

హైందవ స్వరాజ్యము

ఆందోళన కాకర మగును. గ్రామములో మిమ్మునుగురించి అతడు విచారణ ప్రారంభము చేయును. అందరును విశాలము ఉదారము నగుమీహృదయమును ప్రశంసింతురు. అతనికి ఖేదము తప్పదు. మీపాదముల బడినాడు. మీ మన్ననను వేడినాడు, మీవస్తువుల మీ కిడినాడు, దొంగగుణమును మానినాడు, మీ సేవకు డైనాడు, గౌరవాస్పదవృత్తి నందినాడు. ఇది రెండవరీతి సాధనము. సాధనగుణమునుబట్టి ఫల గుణమును మారిన దనుట విదితము. ఇందువలన అందరు దొంగ లిట్లే నడుతు రనిగాని అందరకును మీకుగల కరుణార్ద్రహృదయమే కలుగు ననిగాని చెప్పరా లేదు. మంచి మార్గ మవలంబించిన మంచిఫలము సాధ్య మనుట కిది తార్కాణముగ చెప్పితిని. శాంతిమార్గ మనేక సందర్భముల ఫల ప్రదము. ఫలప్రదము కానప్పుడు నష్టదాయకము కాదు. పశుబలప్రయోగమున నష్ట మున్న దికాని ఇందు లేదు.

అర్జీలు పెట్టుకొనుఆచార మాలోచింతము. బలాధారము లేనిఅర్జీ వ్యర్థ మనుట నిత్యము. అయినను కీర్తి శేషులైన రనడే గారు. అర్జీలవలన ప్రజలవిజ్ఞాన మభివృద్ధి యగుఫల మున్నది కావున అవి ఆరీతిని ఉపయోగకరము లనిచెప్పిరి. వానివలన ప్రజలమతము యొక్క నిజస్థితి తెలియగలదు. పరిపాలకులకు హుషారు కాగలదు.. ఇట్లాలోచించినయెడల ఒక వేళ అర్జీలు వ్యర్థములు కావేమో. . సమానుడు పెట్టుకొను. అర్జీమర్యా