పుట:Gutta.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడు దేవునిగా ఎప్పటికీ తన జ్ఞానము చెప్పడు. అయితే దేవుడు దేవునిగా కాకుండా మరొక రకముగా చెప్పుటకు అవకాశమున్నది. మరొక విధానముగా అంటే ఎలాగ అని యోచిస్తే, భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 15వ శ్లోకమున ‘‘సర్వస్య చాహం హృది సన్ని విష్టో మత్తః స్స్మృతిర్‌ జ్ఞాన మపోహనంచ’’ అన్నట్లు సర్వ మానవుల హృదయముల నున్న దేవుడే అందరికీ జ్ఞప్తిని, జ్ఞానమును, ఊహలను అందిస్తున్నాడు (దేవుడు దేవునిగా కాకుండా ఆత్మగా ఈ పనిని చేయుచున్నాడు.) నా యోచనకు కూడా నా శరీరములో హృదిస్థానములోనున్న ఆత్మయే ఒక ఊహను జవాబుగా అందించింది. అదేమనగా!


దేవుని జ్ఞానము భూమిమీద అవసరమైనపుడు, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. కావున దేవుడు స్వయముగా చెప్పకుండా మరొక విధానమును అనుసరించి చెప్పును. ఆ విధానము ప్రకారము దేవుని జ్ఞానమును ఏ మనిషీ చెప్పకుండా దేవుడే చెప్పినప్పటికీ, దేవుడు స్వయముగా చెప్పినట్లు కూడ ఉండదు మరియు మనిషి స్వయముగా చెప్పినట్లు ఉండదు. కనిపించే మనిషే దేవుని జ్ఞానమును చెప్పినప్పటికీ, లోపలనుండి చెప్పినవాడు మనిషికాదు (జీవుడు కాదు). అలాగే లోపలనుండి చెప్పినవాడు దేవుడూ కాదు. ఈ విధానము ప్రకారము ఇటు మనిషి చెప్పినట్లుగానీ, అటు దేవుడు చెప్పినట్లుగానీ కనబడదు. ఇప్పుడు ఇటు మనిషీ చెప్పక, అటు దేవుడూ చెప్పక ఎవరు చెప్పారు అను ప్రశ్న రాగలదు కదా! దానికి సమాధానము ఇలా కలదు. దేవుని జ్ఞానము భూమిమీద ఏ మనిషికీ తెలియదు, కావున మనిషి చెప్పాడనుటకు వీలులేదు. అలాగే దేవుడు ఏ పనినీ చేయడు, కావున మనిషిలోనుండి దేవుడు చెప్పాడనుటకూ వీలులేదు. అందువలన దేవుడు ప్రత్యేకమైన విధానమును ముందే ఏర్పరచి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/6&oldid=279891" నుండి వెలికితీశారు