పుట:Gutta.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ప్రబోధానంద యోగీశ్వరులతో కలిసివుండడమే కాకుండా, మా ఇద్దరికి (జీవాత్మ, ఆత్మకు) పెద్దయిన పరమాత్మ (దేవుడు) నాతో కలిసి యున్నాడు. నేను జీవాత్మయిన ప్రబోధానంద యోగీశ్వరులతో కలిసివుండగా, నాతో పరమాత్మ అయిన దైవము కలిసివున్నాడు. అందువలన ఒకే శరీరములోనున్న మేము ముగ్గురము ఒక్కటేనని తెలియవలెను. మీ శరీరములలో ఆత్మనైన నేను జీవాత్మతో సంబంధపడి ఉన్నానుగానీ, పరమాత్మతో ఎటువంటి సంబంధములేదు. అందువలన మిగతవారికి ఎవరికైనా గానీ, దేవుని జ్ఞానము యొక్క రహస్యము పూర్తిగా తెలియదు. ఇది ఒక మతమునకు సంబంధించిన విషయముకాదు. అన్ని మతముల మనుషుల లోపల ఉన్న విధానము. దైవాంశగల ఆత్మగల వ్యక్తి మాత్రమే సంపూర్ణ జ్ఞానమందించు అవకాశము గలదు. దైవాంశ లేని మనిషి ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఎంతటి జ్ఞాపకశక్తి గలవాడైనా సరియైన దైవధర్మములను అందించలేడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము కలదు. కానీ అది మీ యోచనకు రాలేదు. ఆ ప్రశ్నను నేనే జ్ఞాపకము చేసి తర్వాత నేనే జవాబును చెప్పెదను. దైవాంశగల ‘‘ఆత్మయున్న శరీరములో జీవాత్మ ఎలాగుండును? ఏ స్థోమత కల్గియుండును? ఏమనుకొనుచుండును?’’ అని అడుగవచ్చును. దానికి జవాబు ఇలాగ ఉన్నది.


పుట్టిన ప్రతి మనిషి శరీరములో రెండు జోడు ఆత్మలు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉండును. జోడుగానున్న ఆత్మలు రెండిటిలో ఒకటి జీవాత్మ కాగా, రెండవది ఆత్మ. ఇక మూడవ దానిని పరమాత్మ అంటాము, లేక దేవుడు అంటాము. శరీరములోనున్న జోడు ఆత్మలలో జీవాత్మకంటే గొప్పది, శరీరమంతా వ్యాపించినది, శరీరమునకు అధిపతిగా ఉండునది ఆత్మ. ఆత్మకంటే వేరుగా ఉండి శరీరము లోపల, శరీరము బయట అంతటా వ్యాపించినది పరమాత్మ. ఆత్మ శరీరమంతటావుండి శరీరమును కర్మ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/44&oldid=279933" నుండి వెలికితీశారు