పుట:Gutta.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరమాత్మకు గుర్తింపుగాయున్న పై రేఖ గు అను అక్షరముగా గుర్తించగా, క్రింద కలిసియున్న రెండు రేఖలలో పొడవైన మొదటి రేఖ ఆత్మగా గుర్తించగా, క్రిందయున్న రేఖను జీవాత్మగా గుర్తించడము జరిగినది. పై రేఖకు ‘‘గు’’ను క్రిందిరేఖకు ‘‘తా’’ను దానికంటే క్రిందిరేఖకు దీర్గము లేని ‘‘త’’ ను గుర్తించడము జరిగినది. క్రింది రెండు రేఖలు కలిసివుండుట వలన ‘తా’ క్రింద ‘త’ ను ఉంచడము జరిగినది. అలా ఉండడము వలన ఒకే జోడుగా నున్న ఆత్మ జీవాత్మలు ‘‘త్తా’’గా ఏర్పడగా, పైనున్న రేఖ గుర్తు ‘‘గు’’ను, త్తా ముందరయుంచితే గుత్తా అయినది. ఈ విధముగా పరమాత్మ, ఆత్మ, జీవాత్మల సారాంశమును తెలుపునది ‘‘గుత్తా’’ అను పదము, కావున గుత్తా అను పేరున్న వంశములోనే ప్రబోధానంద పుట్టడము జరిగినది. ఆయన జీవితము ఒకవైపు మనుషులు గుర్తించలేని విధానముతో ఉండినా, ఒకవైపు జ్ఞానసంబంధ విలువలు బయటికి కనిపించునట్లు దేవుడే అమర్చాడు. ఈ విధముగా ఆయన పుట్టిన సంవత్సరము ప్రత్యేకమైన అర్థముకలదే, అలాగే ఆయన పుట్టిన వంశము గొప్పదే. ఇప్పుడు ఆయన పుట్టిన కులమును గురించి చెప్పుకొందాము.


గుత్తా అను వంశము రెడ్డి కులమున మరియు కమ్మ కులమునా కలదు. రెడ్డి కులమున ఉన్న గుత్తావంశములో ప్రబోధానంద పుట్టకుండ, కమ్మ కులములోనున్న గుత్తావంశములో పుట్టాడు. దానికికల కారణము తెలియాలంటే ముందు కమ్మ కులమును గురించి తెలుసుకొందాము. పూర్వము ఎగువ, దిగువ అను రెండు సమాజములు రెండు కులములుగా ఉండేవి. దైవజ్ఞానముగల వారు ఎగువవారిని పిలువబడేవారు. దైవజ్ఞానము లేనివారిని జ్ఞానమున్న ఎగువవారు, మా దిగువవారని పిలిచెడివారు. ఎగువవారు బ్రహ్మజ్ఞానము తెలిసినవారని బ్రహ్మణులుగా పిలువబడేవారు. జ్ఞానములేని వారందరిని మా దిగువ కులమని బ్రహ్మణులు చెప్పుట చేత,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/34&oldid=279916" నుండి వెలికితీశారు