పుట:Gutta.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవాంశగల శరీరములో ఆత్మ, జీవాత్మ మరియు పరమాత్మ ఉండినప్పటికీ, ఆ శరీరము సర్వసాధారణముగా కనిపించినప్పటికీ, మీకు తెలియని ప్రత్యేకత ఆ శరీరమునకున్నది. సాధారణ మనిషి జన్మించినపుడు శిశుశరీరము తల్లిగర్భమునుండి పుట్టిన తర్వాత, కదలికలేని శిశుశరీరము లోనికి ఆత్మ జీవాత్మతో పాటు వచ్చిచేరును. ఒక ప్రదేశములో మరణించిన జీవుడు ఆత్మతోసహా కలిసివచ్చి అప్పుడే పుట్టిన శిశువులో చేరడము జరుగుచున్నది. జన్మించిన శిశుశరీరములోనికి జీవుడు, ఆత్మ చేరడము సర్వజీవరాసులకు జరిగెడి విధానముగా ఉన్నది. అయితే దైవాంశగల ఆత్మపుట్టునపుడు శిశుశరీరము తల్లిగర్భములో ఉండగానే ఆ శరీరములో ఆత్మ జీవాత్మ ఉండును. శిశువు పుట్టకముందే తల్లిగర్భములోనే ఆత్మ ఉండడము ఒకే ఒకదైవాంశగల శరీరములో మాత్రము జరుగును. దానిని అరుదైన జన్మగా భావించుచున్నాము. అటువంటి జన్మ కొన్నివేలసంవత్సర ములకొకమారో లేక కొన్ని లక్షల సంవత్సరములకొకమారో జరుగుచుండును. భూమిమీద అజ్ఞానము పెరిగిపోయి, జ్ఞానము తెలియకుండాపోయినపుడు, అజ్ఞానమునే జ్ఞానముగా, జ్ఞానమునే అజ్ఞానముగా చెప్పుకొనువారుండు నపుడు, మనుషులు ఎవరూ ఇది నిజమైన జ్ఞానమని చెప్పలేరు. అటువంటి సమయములో దేవుడే తన జ్ఞానమును చెప్పవలసియున్నది. దేవుడు తాను స్వయముగా పనిచేయనివాడు కావున దేవుడు ప్రత్యేకమైన విధానమును అనుసరించి తన అంశగల ఆత్మచేత జ్ఞానమును చెప్పించును.


ముఖ్యముగా ఇప్పుడు చెప్పు సత్యమేమనగా! దైవాంశగల ఆత్మ యున్న శరీరము బయటికి ఎవరికీ గుర్తింపు లేకుండా ఉండును. అయితే ప్రబోధానందయోగీశ్వరులు కూడ ఇతరులు చూచుటకు ఏ గుర్తింపు లేనివాడైనా దేవుడుమాత్రము ఆయనకు కొన్ని గుర్తింపులను, యోచించు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/29&oldid=279931" నుండి వెలికితీశారు