పుట:Gutta.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ ఒకదానితో ఒకటి సంబంధపడివున్నవి. మూడవదైన పరమాత్మ శరీరములో ఉన్నప్పటికీ జీవాత్మ ఆత్మతో ఎటువంటి సంబంధము లేకుండా ఉండడమేకాక శరీరమునుండి ఆత్మ, జీవాత్మలు పోయి మరణమును పొందినప్పటికీ, మృతదేహములో కూడా పరమాత్మ వ్యాపించియున్నది. ఇకపోతే పరమాత్మ అంశతో కూడుకొన్న శరీరములో ఆత్మ పరమాత్మతో సంబంధపడివుండును. ఆత్మ ఒకప్రక్క శరీరములోని పరమాత్మతో సంబంధము పెట్టుకొని, మరొక ప్రక్క జీవునితో కూడా సంబంధపడి శరీరమును నడుపుచున్నది. అటువంటి శరీరముగల వ్యక్తిది ప్రత్యేకమైన జన్మయని అనవచ్చును. ఆ శరీరములోనున్న ఆత్మ సర్వసాధారణముగా శరీరమును నడుపుచూ జీవునికి కష్టసుఖములను అందించుచుండును. అటువంటి స్థితిలో ఆ వ్యక్తిది ప్రత్యేకమైన జన్మ అని ఎవరికీ గుర్తింపు లేకుండా పోవును. బయటి శరీరమును సర్వసాధారణముగా నడిపించు ఆత్మ పరమాత్మతో సంబంధపడి ఉండడము వలన, పరమాత్మ యొక్క కొద్దిపాటి అంశ ఆత్మతో కూడివుండుట వలన, పరమాత్మ జ్ఞానమును ఆత్మ శరీరము ద్వారా తెలియజేయుచున్నది. పరమాత్మ జ్ఞానము పరమాత్మకు తప్ప ఆత్మకు కూడా తెలియదు. అందువలన అన్ని శరీరములలోనున్న ఆత్మ దేవుని జ్ఞానమును చెప్పడములేదు. ఒక్క పరమాత్మ అంశ కల్గిన ఆత్మమాత్రము దేవుని జ్ఞానమును తెల్పుచున్నది. దేవుని అంశ కలిగియున్న ఆత్మకూడా ఒక శరీరములో ఉండుట వలన ఆ శరీరమునుండి దైవజ్ఞానము వెలువడుచున్నది. ఏ శరీరములో ఏ ఆత్మ నివసించుచున్నదీ ఎవరికీ తెలియదు. కావున ఫలానా శరీరమునుండి చెప్పబడునదియే నిజమైన దైవజ్ఞానమని ఎవరూ కనుగొనలేరు. పరమాత్మ అంశతో కూడిన ఆత్మ ధరించిన శరీరము భూమిమీద అరుదుగా పుట్టుచుండును.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/28&oldid=230377" నుండి వెలికితీశారు