పుట:Gutta.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతముగా మారిపోయినది. అలాగే ఎంతో ప్రేమతో ఆదరించి అన్నము పెట్టు అమ్మ కులముగా పేరుగాంచిన కులము కమ్మకులముగా మారిపోయినది. కులము, మతములు మధ్యలో పుట్టుకొచ్చినవైనా, వంశము అనునది ఆదిలోనే ఏర్పరచ బడినది. ప్రబోధానంద జీవితము దైవాంశగల ఆత్మతో కూడుకొన్నది, కావున ఆయన ప్రత్యేకించి గుత్తావంశములో పుట్టడము జరిగినది. ఇప్పుడు గుత్తా అను పేరులోగల విశిష్టతను గురించి తెలుసుకొందాము.


ఈ పుస్తకము మొదటిలోనే ‘‘గు’’ అను అక్షరమును గురించి చెప్పడము జరిగినది. ‘‘గు’’ అనగా రహస్యమనీ, రహస్యమైనది దైవమనీ, పరమాత్మను (దైవమును) తెల్పు గుర్తుగా ‘‘గు’’ను వాడుచున్నామని చెప్పు కొన్నాము. దేవుడు మూడు ఆత్మలుగా విభజింపబడినాడని భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తియోగమను అధ్యాయమున 16, 17 శ్లోకములలో చెప్పబడినది. దేవుడైన పురుషుడు ఆధ్యాత్మిక జ్ఞానములో ముగ్గురు పురుషులుగా చెప్పబడుచున్నాడు. ఆదియందు మొదట పరమాత్మనుండి ఆత్మ ఉద్భవించగా, తర్వాత జీవాత్మ ఉద్భవించినది. ప్రపంచములో జీవాత్మ, ఆత్మలు జోడు ఆత్మలుగా శరీరమందు ఉండగా, పరమాత్మ ప్రత్యేకముగా ఉన్నాడు. సాధారణ మనిషిలో జీవాత్మ, ఆత్మలు రెండూ పుట్టడము చావడము జరుగుచున్నది. పరమాత్మ మాత్రము పుట్టువాడు కాదు, గిట్టువాడు కాదు. జీవరాసుల శరీరములో లేక మనుషుల శరీరములో పరమాత్మ, ఆత్మ జీవాత్మలతో ఎటువంటి సంబంధములేకుండా ఉన్నాడు. జీవుని కర్మానుసారము ఆత్మ శరీరమును ఆడించుచుండగా, శరీరములో సంభవించు కష్టసుఖములను జీవుడు (జీవాత్మ) అనుభవించుచున్నాడు. ప్రతి మనిషిలోను అలాగే ప్రతి జంతువులలోనున్న జీవాత్మకు ఆత్మతోడుగా ఉండి, జీవాత్మ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/27&oldid=279912" నుండి వెలికితీశారు