పుట:Gutta.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరమాత్మ అంశతో కూడుకొన్న లేక పరమాత్మ ఆజ్ఞతో కూడుకొన్న ఆత్మయని తెలియవలెను.


ప్రబోధానంద యోగీశ్వరులు పుట్టిన సంవత్సరము యొక్క పేరు వికృతి నామసంవత్సరము. ప్రకృతికి వికృతి విభిన్నమైనది. ఒక లెక్క ప్రకారము చెప్పితే ప్రకృతి అంటే మాయ, వికృతి అంటే మాయకంటే విభిన్నమైన దేవుడు అని అర్థము. దైవమునకు గుర్తుగా పిలువబడు వికృతి నామ సంవత్సరములో పుట్టడమే ప్రబోధానంద యోగీశ్వరులకు ఒక ప్రత్యేకతయని తెలియాలి. ఇప్పటికి వికృతి నామసంవత్సరము రెండవమారు వచ్చి దాని తర్వాత ఖర నామ సంవత్సరమూ, దాని తర్వాత నందన నామ సంవత్సరము వచ్చినది. రెండవమారు వచ్చిన వికృతి 61వ సంవత్సరమున కాగా, ఖర 62వ, సంవత్సరమైనది. ప్రస్తుతము జరుగుచున్న నందన సంవత్సరము 63వ సంవత్సరము. అందువలన ఇప్పుడు ప్రబోధానంద యోగీశ్వరుల యొక్క వయస్సు 62 అయిపోయి 63వ సంవత్సరము జరుగుచున్నది. ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానము అను అర్థమునిచ్చు ఇందూమతములో (హిందూమతములో) పుట్టడము జరిగినది. ప్రత్యేకమైన పూర్వ చరిత్రయున్న కమ్మకులమున పుట్టడమైనది. కమ్మ కులములో ఎన్నో ఇంటిపేర్లు (వంశము పేర్లు) ఉన్నా ప్రత్యేకించి గుత్తా వంశములోనే పుట్టడము జరిగినది. ప్రబోధానంద పుట్టిన సంవత్సరమూ, పుట్టిన మతమూ, పుట్టిన వంశమూ, పుట్టిన కులమూ అన్నీ ఒక విధముగా ప్రత్యేకత కలిగినవేనని చెప్పవచ్చును. ఆయన పుట్టినప్పటికే సంవత్సరము పేరూ, వంశముపేరూ రెండూ మార్పు చెందకుండా ఉండగా, మతము, కులము యొక్క పేర్లలో కొంత మార్పు జరిగినది. జ్ఞానుల మతమను పేరుగలదీ, శివుడు ధరించిన చంద్రవంక పేరుగలదీ అయిన ఇందూమతము ఏ అర్థమూ లేని హిందూ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/26&oldid=279911" నుండి వెలికితీశారు