పుట:Gutta.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Parsai gutta

నేను జ్ఞానము చెప్పడమేమిటి? ఏమీ తెలియని వారు నన్ను మెచ్చు కోవడమేమిటి? ఇదంత తెలివి తక్కువ’’ అని అనుకొనెడివాడు. అంతలోనే జ్ఞానము తనకు మతికి వచ్చి ‘‘చెప్పేవాడిని నేను కాదు కదా’’ అని తలచే వాడు. ఇటువంటి ఘర్షణ అప్పుడప్పుడు జరుగుచుండేది.


ఇటువంటి సందర్భములో హిందువులమనీ, హిందూ ధర్మ రక్షకుల మనీ పేరుపెట్టుకొన్న వారు త్రైతసిద్ధాంతమును క్రైస్తవములోని త్రిత్వముగా భావించి ప్రబోధానంద యోగీశ్వరులను హిందూ ముసుగులో నున్న క్రైస్తవుడనీ, క్రైస్తవమతమును ప్రచారము చేయుచున్నాడని నిందించడ ము జరిగినది. దానికి స్పందించిన ప్రబోధానంద ఇకమీదట ఎవరికీ జ్ఞానమును చెప్పకూడదనుకొన్నాడు. నేను మనుషుల మంచిని కోరి ఎంతో వివరముగా ఇందుత్వము (హిందుత్వము) లోని ఆత్మజ్ఞానమును బోధించితే, పరాయి మతమని కొందరనుకోవడము వలన తాను జ్ఞానమే చెప్పకుండా అందరివలె సాధారణముగా ఉండవలెనని అనుకొన్నాడు. ఒకప్రక్క ఎవరో అజ్ఞానులు అనుకొను మాటలను ఎందుకు పట్టించుకోవాలి, నేను మతము అను పేరుతో ఏ బోధలు చెప్పలేదు కదా! నేను చెప్పునది స్వచ్ఛమైన దైవజ్ఞానము కదా! అని అనుకొనెడివాడు. ఈ విధమైన ఆలోచనలలో ఆయనయందు కొంత స్తబ్దత ఏర్పడినది. ఆయన మొదట ప్రబోధ గ్రంథమును వ్రాసిన తర్వాత, ఒక స్వామీజీవద్ద మంత్రోపదేశము పొంది ప్రబోధానంద అను పేరును పొందిన తర్వాత, 1980వ సంవత్సరము ప్రబోధాశ్రమమును స్థాపించియుండెను. హిందూపరిషత్‌లోని అజ్ఞానులు కొందరు ఆరోపణలు చేయడముతో ప్రబోధాశ్రమము అను పేరునే తీసి వేయాలనుకొన్నాడు. ఆ సమయమలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు వ్రాసిన కాలజ్ఞానములో ‘‘ప్రబోధాశ్రమము ఉన్నతమైన జ్ఞానము కలది’’ అను వాక్యమున్నట్లు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/21&oldid=396904" నుండి వెలికితీశారు