పుట:Gutta.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాత ఒకవైపు తల్లిని పోషిస్తూ, వైద్య వృత్తిని చేస్తూ ప్రజలతో సంబంధము ఏర్పరుచు కొని వచ్చిపోయేవారికి కొంత జ్ఞానమును చెప్పేవాడు. ఆయనవద్ద ఎంత పెద్ద రోగములైనా సులభముగా నయమైపోయేవి. వైద్యవృత్తితో అంతో ఇంతో డబ్బు వచ్చేది, ఆ సందర్భములో వచ్చినవారికి రోగములు కర్మలనుబట్టి వస్తాయని జ్ఞానమును చెప్పుటకు అవకాశము ఉండేది. తనకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా జీవితము మాత్రము సుఖముగా సాగి పోయేది. ఆయన ఎంత సుఖముగా బ్రతికినా, ఎంత తెలివిగలవాడైనా ఆయన కులమువారు ఆయనను ఆస్తిలేనివాడని హేళనగ చూచెడివారు. ఒక విధముగా సమాజములో ఆస్థిలేనివాడైనా ధైర్యముగా బ్రతికెడివాడు. ఎక్కడా నేర్వకనే ఆయనకు వైద్యము, జ్యోతిష్యము వచ్చెడివి. వాటితో ప్రజల సంబంధము ఏర్పరుచుకొని ఎన్నో వైద్యములను చేయడము జరిగినది. ఆయనకు నేను ఏమీ తెలియనివాడిని కదా! అని ఒక ప్రక్క అనిపిస్తున్నా, ఒకప్రక్క అన్నీ తెలిసినవాడిగా అప్పటికప్పుడు వచ్చిన యోచన ప్రకారము వైద్యము చేసెడి వాడు. దానితో ఎక్కడా నయముకాని రోగములు బాగైపోయేవి. అలాగే ఎవరైన జ్యోతిష్యమును గురించి అడిగితే తాను ఏమి చెప్పితే అదే జరిగేది. ఇట్లు తక్కువ కాలములోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇది బ్రతుకు తెరువే అయినా తనకు ఆ పని నచ్చక తాను ఆ వృత్తిని చేయకుండా ఇతరులచేత చేయించెడివాడు. ఆ సమయములోనే ప్రబోధ అను గ్రంథమును వ్రాసి తనకు పరిచయమున్న ఒక ఆశ్రమములోని స్వామీజీకి చూపడము జరిగింది. ఆ స్వామిజీ దానిని చూచి ఆశ్చర్యపోయి ఇంతటి జ్ఞానమున్న వానికి గురువు తప్పకుండా ఉండాలి, నేను ఉపదేశమిస్తాను తీసుకోమన్నాడు ఆ స్వామిగారు ఒక మంత్రమును చెప్పి అదే ఉపదేశమన్నాడు. అంతేకాక నీకొక పేరును

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/16&oldid=230366" నుండి వెలికితీశారు