పుట:Gutta.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జవాబులు చెప్పలేక తికమకపడుచుందురు. తమ లోపమును బయట పడకుండునట్లు తగిన ప్రయత్నములు చేయుచుందురు. కొందరు తమకు తెలిసినదే సత్యమని మొండిగా వాదించుచుందురు. అన్ని మతములలోను జ్ఞానులున్నా వారిది సరియైన జ్ఞానముకాదని అర్థమైపోయినది. అంతే కాకుండా అన్ని మతములలోను అజ్ఞానము తారా స్థాయికి పెరిగిపోయి, మతద్వేషములు ఎక్కువయిపోయి, ఒక మతమువారు మరొక మతము వారిమీదికి భౌతిక దాడులకు దిగుచున్నారు. ఒకరికొకరు ప్రాణాంతకముగా తయారైనారు. ఇటువంటి పరిస్థితి కొంతకాలముగా కొనసాగుచున్నది.


ప్రపంచములో ఎన్ని మతములుండినా అన్నిటికంటే ముందునుండి ఉన్న మతము ఇందూ (హిందూ) మతము. ఇందూ మతము అనునది సృష్ఠి ఆదిలో దేవుడు జ్ఞానమును బోధించినప్పటినుండి ఏర్పడినది. ఇందూ మతము ఎప్పుడు పుట్టిందో స్పష్టముగా చెప్పలేము. ఐదువేల సంవత్సరముల పూర్వము ద్వాపరయుగం చివరిలో కృష్ణుడు దేవుడు ఆదిలో చెప్పిన జ్ఞానమే చెప్పాడు. కృష్ణుడు చెప్పిన గీతాజ్ఞానమే దేవుడు చెప్పిన జ్ఞానముగా ఉండినప్పటికీ, మాయ ప్రభావము చేత కొందరు మనుషులు వ్యాసుడు వ్రాసిన వేదములే గొప్పవని చెప్పడము జరిగినది. కొంతకాలమునకు కేరళ రాష్ట్రములో పుట్టిన ఆదిశంకరాచార్యులు దైవజ్ఞానమును అద్వైత సిద్ధాంత రూపముగా చెప్పడము జరిగినది. తర్వాత కొంత కాలమునకు తమిళనాడు రాష్ట్రములో పుట్టిన రామానుజాచార్యులు విశిష్ట అద్వైత (విశిష్టాద్వైత) సిద్ధాంతమును ప్రతిపాదించి చెప్పడము జరిగినది. ఆ కాలములో అద్వైతము వారూ, విశిష్టాద్వైతము వారూ ఒకరికొకరు మాది గొప్ప, మాది గొప్ప అని ఘర్షణపడినట్లు చరిత్ర కలదు. తర్వాత కొంత కాలమునకు కర్ణాటక రాష్ట్రములో పుట్టిన మధ్వాచార్యులు ద్వైతసిద్ధాంతమును

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/12&oldid=279898" నుండి వెలికితీశారు