పుట:Gutta.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బట్టి దూతల ద్వారా విన్న వక్తలు కూడా కొన్ని వాక్యముల పరమార్థము తమకు తెలియదనియే చెప్పారని తెలియుచున్నది. ఈ విధముగా దేవుడే కాకుండా దేవుడు చెప్పినప్పుడు వినిన సూక్ష్మ (కనిపించని) గ్రహములు కూడా దూతల పేరుతో భూమిమీద అక్కడక్కడ కొందరికి తెలిపినట్లు అర్థమగుచున్నది.


ద్వాపర, కలియుగములలో దేవుడు కనిపించే మనిషినుండి రెండు మార్లు చెప్పినా, అదే జ్ఞానమునే కనిపించని గ్రహములు, దేవదూతలు అనుపేరుతో మనుషులకు చెప్పినా, చెప్పిన జ్ఞానమంతయు మతాలుగా మారిపోయినది. కానీ చెప్పబడిన జ్ఞానము యొక్క వివరము మాత్రము ఎవరికీ తెలియకుండాపోయినది. దేవుని జ్ఞానమును మాయ మతములుగా మార్చివేయడము వలన ఒకే దేవుని జ్ఞానము మతముల రూపములో వేరువేరుగా కనిపిస్తున్నది. అలా కనిపించుట వలన వేరువేరు మతములకు వేరువేరు దేవుడన్నట్లు ఆయా మతముల వారికి అర్థమైనది. ఈ విధముగా దేవుని జ్ఞానము మతములుగా చీలిపోయి ఒకే దేవుని జ్ఞానమే కొందరికి భగవద్గీతయనీ, కొందరికి బైబిల్‌ అనీ, మరికొందరికి ఖురాన్‌ అని తెలియ బడినది. అలాగైనప్పటికీ వారివారి గ్రంథములలోని వాక్యములకు అర్థము మాకు తెలియునని ఆయా మతములవారు అనుకొనినా, వాస్తవానికి వాటి పరమార్థము మాత్రము ఎవరికీ తెలియదు. భగవద్గీతలోగానీ, బైబిలులోగానీ, ఖురాన్‌లోగానీ గల వాక్యములకు దేవుడే వివరము చెప్పవలసివున్నది. దేవుడు చెప్పిన జ్ఞానమును దేవుడే వివరించి చెప్పువరకు ఏ మతము వారికైనా వారి గ్రంథములలోని అంతరార్థము తెలియదు. నేటికాలములో కొన్ని మతములలోని పండితులు, స్వామీజీలు తమ గ్రంథముల జ్ఞాన వివరము అంతా తెలియునని చెప్పుచుండినా, సూటిగా వేయు ప్రశ్నలకు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/11&oldid=279897" నుండి వెలికితీశారు