పుట:Gutta.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడదు. అంతా ఆయన ఇష్టము. మనిషి అయిన కృష్ణుని శరీరమునుండి జ్ఞానమును బోధించునపుడు నేనే పరమాత్మనని కూడ దేవుడు తెలియజేశాడు. అది ఒక నిరూపణ నిమిత్తము తన విధానమును తెలియుటకు అలా తెలిపాడు. ద్వాపరయుగములో కృష్ణుని శరీరమునుండి తెలుపబడిన విషయమును బట్టి, దేవుడు మనిషిలో ఆత్మనుండి మాట్లాడగలడని రుజువు కాబడింది.


దేవుడు తన జ్ఞానమును ఐదువేల సంవత్సరముల పూర్వము ద్వాపర యుగమున శ్రీకృష్ణుని శరీరమునుండి బోధించాడు. తర్వాత కూడా ఒకమారు అదే విధముగా బోధించాడని తెలియుచున్నది. తర్వాత కూడా మరొక మారు బోధించవలసిన అవసరమున్నది. దేవుడు మూడుమార్లు భూమి మీదకు వస్తే ఆయన పూర్తిగా తన ధర్మములను బోధించినట్లగును. రెండు మార్లు తన ధర్మములను జ్ఞానరూపములో తెలిపినప్పటికీ, మానవులు వాటి వివరమును గ్రహించలేరు. కనుక మూడవ మారువచ్చి తాను చెప్పిన వాటికి పూర్తి వివరమును తెలియజేయును.


ఇప్పటి వరకు దేవుని ధర్మములు భూమిమీద రెండుమార్లు బోధించ బడినప్పుడు మనుషులే కాకుండా గ్రహరూపములో మరియు భూతముల రూపములోనున్న కొందరు విని, వాటిని భూమిమీద ముఖ్యమైన వ్యక్తులకు కొందరికి బోధించారు. అయితే వారు కొన్ని ధర్మములను చెప్పినప్పటికీ వాటి వివరము తమకు తెలియదనీ, వాటి వివరము దేవునికే తెలియునని చెప్పారు. దూత అని పిలువబడు భూతములు లేక గ్రహలచేత తెలుసుకొన్న వ్యక్తులు తాము విన్న బోధలను వక్తలుగా ఇతరులకు చెప్పినప్పుడు, వీటి అంతరార్థము భవిష్యత్తులో రాబోయేవారు తెలియగలరని చెప్పారు. దీనిని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/10&oldid=279896" నుండి వెలికితీశారు