పుట:Gurujadalu.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ కిందిది గ్రంథారంభ మంగళ శ్లోకము : సమగ్రోవర్ధమానాయ విశ్వవిద్యావభాసినే సర్వభాషా మయీభాషా ప్రవృత్తాయన్ముఖాంబుజాత్|| యే వస్తువు నుండి అన్ని భాషలకూ సంబంధించి నటువంటి భాష కలిగినదో సంపత్తును కలుగచేసేటటువంటిన్నీ, అన్ని విద్యల్నీ తెలియచేసేటటువంటిన్నీ ఆ వస్తువుకు ప్రణామములు. ఈ శ్లోకము పై వ్యాఖ్యానంలోని కొంత భాగమిది. శబ్దాను శాసనం హి ప్రస్తుతమ్ | తత్రచ అనుశాసన విషయ భూతాః శబ్దాః కర్ణాటకా ఏవ, తేచ సంస్కృత శబ్ద వత్సకల దేశ ప్రసిద్ధాః సకల శాస్త్రపయోగితయా సకల మహాజన పరిగ్రాహ్యశ్చ నభవంతి! భాషా విషయత్వాత్ | భాషాయాం చ పామరాణామే వాధి కారోన పండితానామేతి వైతేనుశాస్యాః ప్రయోగానర్హత్వాదితి| కేషాంచిత్సంస్కృతా గ్రహ గ్రహగ్రస్తానాం పండితమ్మన్యానామ్ మనసిప్రఖ్యాతా మన్యథా ఖ్యాతిం ప్రత్యాఖ్యాతుమేత దేవ విశేషణ ముపవర్ణి తవాన్ గ్రంథకారః ఇదమత్రా కూతమ్ | యథాసంస్కృత శబ్దాః స్వాధ్వసాధు వివేచన విషయతయానుశాసనారా | తథా భాషా శబ్దా అపి | యదిచామీనానుశాశ్యాః కథంతర్షి భగవద్భాషా తన్మయీస్యాత్ | సహ్యపశబ్దమయీసా. శబ్దమేరీతిగా ఉపయోగింపబడుతున్నదో యిప్పుడు మనం చెప్పుకుందాము. అందులో ముఖ్యంగా యిప్పుడు మనం తెలుసుకోవలసినది కన్నడ శబ్దాలు యేలాగున ప్రయోగింప బడుతున్నవనే విషయం. సంస్కృత శబ్దాలు అందరిచేతా పరిగ్రహింపబడుతున్నట్లు, అన్ని చోట్లా ప్రసిద్ధమైనట్లు, అన్ని శాస్త్రాలను సమన్వయించినట్లు కన్నడ శబ్దాలు పరిగణింపబడడం లేదు. యిక భాషను గురించి ముచ్చటించుకుందాం. జనుల వాడుకలో వుంటున్నది కనక, పండితులకు గ్రంథాలలో ఉపయోగార్హమైనది కాదు కనుక పండితులకు భాష ఉపయోగపడక జనులకు మాత్రమే మిక్కిలి ఉపయోగపడుతున్నది. అందులోనూ సంస్కృతం తెలియని కొందరు తాము పండితులమనుకుంటూ కొన్ని అనుకూల శబ్దాలను అననుకూలమైనవిగానూ మరికొన్ని అనను కూల శబ్దాలను అనుకూలమైనవిగానూ పొరపాటు పడుతున్నారు. అటువంటి పండితమ్మన్యులను గురించి మాత్రమే మేమిక్కడ ప్రస్తావిస్తున్నాము. సంస్కృత శబ్దాలను అవసరానవసరాలను బట్టి యెలాగున ప్రయోగించుకుంటున్నామో అలాగునే యీ భాషా పదాలు కూడా ఉపయోగిం చుకోవచ్చును. అన్ని విధాలా యీ భాషా శబ్దాలకు సంస్కృతంతో సంబంధమున్నది కనుక యివి సర్వదా ప్రయోగార్హములే. వీటిని అపశబ్దాలని యెంత మాత్రం పేర్కొనడానకు వీలులేదు. ఇదీ వ్యాఖ్యానం. పై వ్యాఖ్యానమును మన తెనుగు భాషా పదాలకు కూడా అనువర్తింప చేసుకొనవచ్చును. గురుజాడలు 623 భట్టకలంకుడు