పుట:Gurujadalu.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భట్టకలంకుడు (కన్నడ వ్యాకరణములు) భట్టకలంకుడు జైనుడు. కర్ణాటక శబ్దానుశాసనమనే గొప్ప కన్నడ వ్యాకరణం రాశాడు. 1604 సంవత్సరంలో గ్రంథం పూర్తి అయినట్లు కనబడుతుంది. ఈనాటికి నిలిచిన కన్నడ వ్యాకరణములలో మొదటివి, రెండవ నాగవర్మ రాసిన కర్ణాటక భాషా భూషణము, కావ్యా లోకములో మొదటి అధికరణమును, రెండవ నాగవర్మ పన్నెండవ శతాబ్ద మధ్య కాలంలో వుండెను. భాషా భూషణము ఆధారంగా చేసుకుని, పదమూడో శతాబ్దంలో కేశిరాజు శబ్ద మణి దర్పణం అనే వ్యాకరణం రాశాడు. డాక్టర్ బర్నలు అనే విద్వాంసులు శబ్దమణి దర్పణమును గురించి ఇలా రాసినారు. "The great and real merit of Sabdamanidarpana is that it bases the rules on independent research and the usage of wirters of repute; in this way it is far ahead of the Tamil and Telugu treatise, which are much occupied with vain scholastic disputations" శబ్దమణిదర్పణములోని సూత్రాలు ప్రత్యేక స్వతంత్ర పరిశోధన మీదనూ, గొప్ప ప్రాచీనకవుల ప్రయోగాల మీదనూ ఆధారపడి రచింపబడినవి. నిరర్థక పాండిత్య ప్రకర్షకమైన వివాదగ్రస్త విషయాలతో నిండిన తెలుగు, తమిళ వ్యాకరణాలకంటే శబ్దమణిదర్పణం ఎంతో మెరుగైనదీ అని దీని భావం. భట్టకలంకుల శబ్దానుశాసనమనే గ్రంథాన్ని మైసూరు ప్రభుత్వము వారు 1890వ సంవత్సరములో బెంగుళూరులో అచ్చు వేయించినారు. యిప్పుడు ప్రతులు దొరకవు. మైసూరు గవర్నమెంటు లైబ్రరీలో వున్న పుస్తకాన్ని నేను అరువు తెచ్చాను. అది తిరిగీ యిచ్చి వెయ్యవలసిన కాలం వచ్చినందున అందులో నుంచి తెనుగు వారికి తెలియతగిన భాగాలు కొన్ని యెత్తి రాస్తున్నాను. ఈ గ్రంథాన్ని గురించి రైసుదొర యిట్లు రాసినారు : "It is ..... not an antique treatise dealing with archaisms and obsolete terms, interesting as a literary monument though of little practical value now, but has the advantage of treating of the whole range of the language down to the mod- ern period and its rules are such as apply to the present time" గురుజాడలు 620 భట్టకలంకుడు