పుట:Gurujadalu.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బంగాళీలలో మొన్నటి వరకూ అంత్య నియమముండెను. మైఖేల్ మధుసూదనదత్తు అనునతడు అంత్య నియమమును విడిచి, ఒక మహా కావ్యమును వ్రాసి, బంగాళీ కవులలో అగ్రగణ్యుడాయెను. నేను యెరిగియె యతిప్రాసములను, అలంకారములను ముత్యాలసరములలో ప్రయోగిం చితిని. నియమముగా నుంచిన యడల, యతిప్రాసములకు గాను తెచ్చిపెట్టుకున్న శబ్దములు అర్థ పటుత్వమును చెరచి, సందర్భమును తప్పించి, యీడ్చుకుపోవును. అందుకు శతావధానిగారు ఎత్తిన ముతకస్మాతయే ప్రమాణము. ఒకజాతి పార్శీగజలు యొక్క నడక ముత్యాల సరములలో తెచ్చుటకు నే యత్నించి యుంటిని. కలమునకు వచ్చినట్లు వ్రాసితీనని శతావధానిగారు అభిప్రాయపడిరి. అది నిజము కాదు. కలమునకు వచ్చినట్టు రాయుట శతావధానిగారికి అలవాటయి యుండును. లేనియడల శతావధాన మెట్లు చేయగలుగుదురు? ఏకైక దిన ప్రబంధ ఘటికాసద్యశృత గ్రంథకల్పన కొందరి మతమున, కవితకు మేర. ఇతరులు అర్థపటుత్వ శబ్రౌచిత్యములను సాధించుటకు మిక్కిలి శ్రమచేతురు. చిత్రములు వ్రాయునప్పుడూ, జిలుగు చెక్కునప్పుడూ శిల్పకుడు యెట్టి పరిశ్రమము చేయునో, అట్టి పరిశ్రమము చేసినగాని కావ్యగుణము లబ్బనేరవని మా మతము. గ్రాంథిక భాషా సంస్కరణమును గురించి నా అభిప్రాయముల నిక్కడ రాయజాలనంటిని. ఒకటి రెండు మాటలు మాత్రము రాయక వుండబట్టక రాస్తున్నాను. శతావధానులుగారు వొక తప్పైనా లేకుండా సంస్కృతము రాయగలిగియుందురు. తెలుగు మాత్రము విస్పష్టముగా రాయజాలరు. లక్షణ గ్రంథములనూ, ప్రాచీన కావ్యములనూ, అనుసరించి గ్రాంథిక భాషనే రాద్దామని వారు యెంత యత్నించిననూ, మాతృభాషా ప్రభావమువల్ల వాడుక భాషలోని ప్రయోగములు, తెలిసో, తెలియకనో పంక్తులలో వచ్చి కూచుంటవి. లేఖరులు; ఎక్కడ యాగినదో; రెండు మాటలు దక్క తెనుగున; వరకు చదివిన; ఉండ వలయు కాని; సిరాయును కాగితము; ఇట్టివి; ఇందు పెక్కులు గానబడుచున్నవి. అని శతావ ధానులు గారు వ్రాసిరి. “సీసపద్య అర్థము యను శీర్షికతో” ననిరట. అకారమునకు యకారము అచ్చుతప్పు యెట్లగును? యిక శతావధాని గారి రాతలలోనూ, వారి మిత్రులు యం.వి. కృష్ణా రావు గారి రాతలలోనూ విసంధులు కానవచ్చుచున్నవి. యే ఆంధ్రశబ్దాను శాసనమో అందులకు ప్రమాణము? బహుశః కౌస్తుభకారుడు ప్రాచీనులమతమని ఉదహరించిన 'సంహితైకపదే నిత్యా” ఇత్యాది కారికలను వారు చూపగలరు. అది కుదరదు. నా రాతల వలన ఆంధ్రభాషకు ముప్పెట్లు వచ్చును? ప్రాచీన గ్రాంథిక భాష, గ్రంథములలో నున్నది. ఎక్కడి మారుమూలల గ్రంథములూ చావుదప్పి అచ్చుపడ్డవి. ప్రాచీన గ్రాంథిక భాష ముత్యాల సరాల లక్షణము గురుజాడలు 618