పుట:Gurujadalu.pdf/662

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతావధానులు గారిని నేనొక ప్రశ్న అడిగెద. పూర్వులు చేసిన ఛందోనియమములు మార్చతగియున్నప్పుడు ఆంధ్రవైయ్యాకరణుల శాసనము లేల మార్చరాదు? "తెనుగు భాషకు అనుగుణమైన వృత్తముల నన్నింటినీ, ప్రాచీనకవు లెరిగి నిరూపించిరి. ఇక మన స్వేచ్ఛా ప్రచారమునకు అవకాశము లేదు” అనే యడల కథ ముగిసినది. యూరోపి యను భాషలలో కవులు కొత్త వృత్తములను కల్పించి భాషాభివృద్ధి చేయలేదో? కొత్త వృత్తములను కల్పించవచ్చునన్నచో, నా నేర్పు కొలది నేనొక కొత్త తోవ తొక్కితిని. తప్పేమి? నలుగురూ ఆమోదించిరా, నేను కల్పించిన వృత్తమును అవలంబింతురు. ఆమోదించరా, పరిత్యజింతురు. గాని దానిని గర్జించుటలో అక్షర విన్యాస మెచటెచట పెటకుగానున్నదో, విరామము లెచటెచట శ్రావ్యతను చెరచెనో, శతావధాని గారు శలవియ్యరైరి. ముత్యాల సరములలో నే చేసుకున్న నియమమిది. మొదటి మూడు చరణములలోను సామాన్యముగా పధ్నాలుగేశమాత్ర లుండును. నాలుగో చరణమున యేడు మొదలు పధ్నాలుగు వరకూ వుండును. విరామమును అర్థానుసారముగా చెవి కింపగునట్లు మార్చయత్నించితిని. ఎంత వరకూ నా యుద్యమము కొనసాగెనో, మార్పుల యెడ నసహనము లేని చదువరులు చెప్పవలె. ఇక యతిప్రాసల మాట. నేను అజ్ఞుడనే కావచ్చును. కాని తెనుగు లాక్షణికులు యతి ప్రాసములని చేసుకున్న సంకేతములు బడి కుర్రవాళ్ళకును తెలిసియుండును గదా. నాకు తెలియకనే అవి నా పద్యములందు అమరినవని శతావధానిగా రెట్లు దలచిరి? తెనుగు నాకు మాతృభాష అవుటను యతిప్రాసములు దొరలినవట. తెనుగు భాషకును, యతి ప్రాసములకును నైసర్గిక సంబంధ మెట్టిదో శతావధానులు శలవిత్తురు గాక! పాత యింగ్లీషులో మన యతి నియమము వంటి నియమముండెను. తరువాత అంత్య నియమము ప్రబలెను. వర్డు వర్తు మొదలైన మహాకవులు అంత్య నియమమును విడనాడి ఉత్కృష్ట కావ్యములు వ్రాసిరి. అప్పుడు మార్పులు సహింపజాలని విమర్శకులు గొల్లు పెట్టిరి. ఇంగ్లీషు భాషకు యవి నైసర్గిక మైనట్టా? అంత్య నియమమయినట్టా? రెండూ కానట్టా? తెనుగును, కన్నడమును అక్క చెల్లెళ్ళు. కన్నడ భాషలో యతి నియమము లేదే? యేమి సాధనము? తెనుగులో కొన్ని జాతులకు, వృత్తములకును ప్రాస నియమము లేదే; దీని కేమి సాధనము? ప్రాకృతాది భాషలలో అంత్య నియమము ప్రబలినది. సంస్కృతమునకు స్వాభావికము కాని ఈ అంత్య నియమము వీటి కేలాగు స్వాభావికమాయెను? తెనుగున మనము యతి ప్రాసములను వాటిని, సంస్కృతకవులచ్చటచ్చట నలంకారములుగా తగిలించుచు వచ్చిరి. చేతగా కనా, లేక సంస్కృత భాష యీ యతిప్రాసములకు వొదగకనా, వారు నియమములుగా నుంచుకొనరైరి? గురుజాడలు ముత్యాల సరాల లక్షణము 617