పుట:Gurujadalu.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలలు తీరిన కత్తిరీజుత్తు పాపిట దువ్వి తా రచించిన "మేఘనాథబధ” అను మహా కావ్యమును చేతబూని తన విశాల నేత్రములతో చూచెడి వారివేపు చూస్తూ పఠంలో కూచున్నాడు. బంగాళా కవుల పటములు బొవుబజారు యిండియన్ ఆర్డు స్టూడియోలో అణాపరక (అణన్నర) కొకొక్కటి అమ్ముతవి. మధుసూదనుడి పెదవులలో చిన్న నవ్వొకటి దాగి ఉంది. ఈయన నాతో మాట్లాడు తూన్నట్టే కనిపిస్తాడు. ఆనాటి యింగిలీషు బారిష్టరులు వీరివిద్యకు జంకేవారని 'రీస్ అండ్ రయ్యత్' పత్రిక సంపాదకులు బాబూ జోగీశ చంద్రదత్తుగారు నాతో చెప్పినారు. గ్రీకు, లాటిన్లు సంస్కృత భాషను, ఫ్రెంచి, జర్మను, ఇవియే కాక తెలుగు, అలవమును మైఖేలు నేర్చియుండిరట. చదువుకునే రోజుల్లోనే వివాహము చేతునని తండ్రి సంకల్పించగా అందుకు అంగీకరించక కిరస్తానం అవలంబించి 1848వ సంవత్సరములో కొందరు చెన్నపట్నపు సహాధ్యాయులతో కూడి చెన్నాపట్నం వెళ్ళాడు. అక్కడ జీవనం జరగడం కష్టమై పత్రికలకు రాసి కాలం వెళ్ళబుచ్చవలసి వచ్చింది. ఆ రోజుల్లోనే బైరన్ రీతిని “కాప్టిల్ లేడి” అనెడి యింగ్లీషు కావ్యం రాయడం. ఇంగ్లీషున గ్రంథములు రాసి పేరు ప్రతిష్ఠలు సంపాదింతుమనే ఆనాటి బంగాళీ విద్వాంసులు ఆశించిరి గాని దేశ భాషను తలపెట్టరయిరి. మధుసూదనుడి మొదటి భార్య ఒక ఇండిగోపొంటరు కుమార్తె. భార్యాభర్తలకు సమరసచెడి ఆమె విడాకులు పుచ్చుకున్నారు. తిరిగి మధుసూదనుడు వరించిన మరొక దొరసాని కష్ట సుఖములలోను ప్రతిష్ట అప్రతిష్టలలోను ప్రేమతో కనిపెట్టి తిరిగినది. ఆమెకు సంతానం కలిగెను. యెనిమిది సంవత్సరాలు చెన్నపట్నంలో వుండి కలకత్తా తిరిగి వచ్చేసరికి పెళ్ళినాటి పెద్దపెళ్ళాం అంటకాగింది. గురుజాడలు 607 వంగీయ సాహిత్య పరిషత్తు