పుట:Gurujadalu.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వంశీయ సాహిత్య పరిషత్తు నారాయణమూర్తి పంతులు, నేను జస్టిస్ ఆశుతోష ముకర్జీగారిని చూడవెళ్ళాం. కొంత ప్రసంగమైన తరువాత “మీలో గొప్ప విద్వాంసులను చూడవలెనని నాకు అభిలాష కలదని” నేనన్నాను. సాహిత్య పరిషత్తులో కొందరు ప్రముఖుల్ని మమ్మును కలుసుకోవడనుకు సమావేశం చెయ్యమని, వారు దాస్ గుప్తాగారితో శలవిచ్చారు. దాస్ గుప్తాగారు వకీలు, బంకించంద్రుడి 'ఆనందమర్' యింగ్లీషు చేశారు. అయిదుగంటలకు సాహిత్య పరిషత్తుకు రమ్మని మాకు ఆహ్వానపత్రిక వచ్చింది. మేం వెళ్ళాం. సాహిత్య పరిషత్తు మందిరం అప్పర్ సక్యులర్ రోడ్డులో జైనమందిరానికి సమీపంగా వున్నది. అది ఒక పెద్దమేడ. కట్టడానికి నలభై యాభై వేలు అయివుండును. గుమ్మం దాటగానే కీర్తిశేషులయిన కాసింబజారు మహారాజావారి ప్రతిమ నేత్రోత్సవం చేసింది. ఆయన స్ఫురద్రూపి. శ్రీ పిఠాపురం రాజావారి వంటి విద్యాభిమానులు. పరిషత్తుకు చాలా ద్రవ్య సహాయం చేసి వుండిరి. అప్పట్లో మేడ రెండో అంతస్తులో పరిషత్తుతో సంబంధించిన యగ్జిబిషను అనగా వింతలయి నట్టి గొప్పవైనట్టి వస్తువులను చూపుట జరుగుతుండెను. మేడకు దక్షిణంవేపు అరలా వొకటి వున్నది. ఆ అర సభలైనప్పుడు, నాటకములు ఆడడానకూ, ఉపన్యాసము లిచ్చుటకూ, ఉపకరిం చును. ఆ అరలో యెదురుగుండా బంకించంద్రుడి పూర్ణచిత్రము కద్దు. బకించంద్రుడు వంగభాషా కావ్య ప్రపంచమునకు బ్రహ్మ అనిన్ని, చంద్రుడు సాటిలేని కవి అనిన్ని ఆ దేశంలో పండిత పామరుల నమ్మకం. ఈయన ముఖాన శాంతమూ శౌర్యమూ కనబడతవి. బంగాళీలలో అనగా నాగరికులలో రెండు రకముల మనుషులను కనిపెట్టాను, గుండ్రని ముఖం, స్థూలకాయం వకటి. ఒంటిపేక కోలముఖం మరివకటి. చిన్నతనంలో బంగాళీ పిల్లలు చాలా సుందరులుగా వుంటారు; చిక్కితే (గిల్లితే) పాలుగారు చెక్కులు; విశాల నేత్రములూ తరుచు. బంకిం కొంచము వొలంగా వుంటాడు. ఆయన పఠానకు యెడంవేపు భారతమును బంగాళీ గద్యంగా రాసిన ఒక కవిపఠం వున్నది. దానికి యెడంవేపు మైకేల్ మధుసూదన దత్తు, గురుజాడలు వంశీయ సాహిత్య పరిషత్తు 606