పుట:Gurujadalu.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంగ్ల సారస్వత బోధనా పద్ధతులు చాలా లోపభూయిష్టంగా వున్నాయని వారి అభిప్రాయం. ఆంగ్ల సాహిత్యంపై హెన్రీ మోర్లే యిచ్చిన ఉపన్యాసాలను, రవీంద్రుడు ఎంతో ఆహ్లాదంతో విన్నారు. విద్యార్థులకు పరీక్షలు చాలా ఆవశ్యకాలని వారి మతం. సిస్టర్ నివేదిత ఆయన కథలను కొన్నింటిని అనువదించింది, కాని ఆమె చనిపోయిన తరువాత, ఆ వ్రాత ప్రతులు కనిపించలేదు. 'మైకేల్'ను రవీంద్రుడు అనుసరించారు. ఆయన గీతంలోని పాదాలు ఏ పాదానికాపాదం అంతం కావు. ప్రయోగాలనూ, వ్యాకరణ నియమాలనూ, కాలదన్ని సరికొత్త శబ్దరూపాలను కల్పించినా, ఆయన సృష్టించిన 'శబ్దాలు' చలామణిలోకి రాలేదు. అందుచేత మన వెనకాల ఒక టిప్పణి వుంటే కానీ, కావ్యం అర్థం కాదు. భాష ఐలీ అయిపోతున్నా సరే, ఆయన “మైకేల్” అనే కావ్యం శబ్దాలంకారాలనే దృష్టిలో పెట్టుకుంది. ఈ విషయాన్ని నేను రవీంద్రునికి సూచించాను. రవీంద్రునికొక పాఠశాల వుంది. ఆ స్కూలులో తనకు తానై సహాయం చేసుకోవడ మెలాగో చెబుతూ, ఆయన ఉపజ్ఞావంతమైన విద్యను ప్రసాదిస్తూ వుంటారు. మెట్రిక్యులేషను, విశ్వవిద్యా లయ పరీక్షలకు కూర్చునే విద్యార్థులు ఎన్నెన్నో విషయాలను అధ్యయనం చేయవలసి వుంటుంది. తన ప్రక్కనే కూర్చున్న యువకుణ్ని 'కావ్యభాష" పై ఒక వ్యాసం వ్రాయమని రవీంద్రుడు ఆదేశించారు. అరుణాస్పదమనే నగరాన్ని వర్ణిస్తూ పెద్దనగారు "అచట బుట్టిన చిగురు గొమ్మైనఁజేవ” అన్నారు. అదే విధంగా కలకత్తా పట్టణంలో చిట్టచివరకి దోమలుసైతం పొలిటీషియన్సే! గురుజాడలు 603 యిద్దరు రాజులు