పుట:Gurujadalu.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వినబడే దేవతార్చనగంట వొక్కటే కొన్ని యిళ్ళలో మిగిలింది. అదైనా దేవుణ్ణి జ్ఞాపకం చెయ్యదు. భోజనపు గంట అయింది. మిగిలిన యిళ్ళలో ఆ గంట మేజాబల్ల మీద యెక్కింది. 1912వ సంవత్సరం, డిసెంబరు నెల, రెండవ తేదీని కలకత్తాలో రవీంద్రుణ్ణి చూశాను. ఆయన ఒక పెద్ద టేబిల్ ముందు కూర్చునివున్నారు. గది అలంకరణతో, వస్తు సామాగ్రితో ఏమంత తీర్చిదిద్దినట్టు లేదు. భవంతి మొదటి అంతస్తులో పశ్చిమదిశగా వుంది ఆయన గది. రవీంద్రుడి కుడి భాగాన యువకుడొకడు ఆసీనుడయి వున్నాడు. టాగూరు సాధుస్వభావి. మాటపొందిక మహా మెత్తన. నాజూకైన ముఖలక్షణాలు. తేటగా, సున్నితంగా నవ్వుతారు. మాటలాడేటపుడు పురుషత్వం తొణికిసలాడుతుంది. ఒక విధమైన ప్రశాంత, మనోనిశ్చయం ప్రస్ఫుటమౌతుంది. మన వీరేశలింగం పంతులుగారి మనః ప్రవృత్తికిది పూర్తిగా విరుద్ధం. ఆయన వలె, రవీంద్రుడు గడబిడగా మాట్లాడరు. సంభాషిస్తున్నప్పుడు సజీవత్వం వెల్లడి అవుతుంది. అయితే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు కంఠం సంగీత శ్రావ్యంగా వుంటుంది. వినసొంపైన గొంతుక. రవీంద్రునిది. బెంగాల్ లో నాటక రచన నీరసావస్థలో వుందని ఆయన అభిప్రాయం. షేక్స్పియర్ నో, లేదా మరొక ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయితనో, వంగదేశ కవులు అనుసరిస్తున్నారని చెప్పలేం; కొంతమంది రచయితలు మాత్రం పాశ్చాత్య సాహితీపరులతో సంపర్కం పెట్టుకుంటున్నారు. కానీ వారి రచనా ప్రభావం, వీరి నాటకాలను సోకడం లేదు. రంగభూమి శిధిలావస్థలో వుంది. ప్రేక్షకులను ఆకర్షించడానికై యధేచ్ఛగా పాటలను, పదాలను నాటకాలలో తెచ్చి పెడుతున్నారు. మొదట ఈ నాటకాలు చారిత్రక యితివృత్తజనితాలు. వీటిలో చాలా మటుకు రాజపుత్ర కథలతో నిండినవే. ఇప్పుడిప్పుడు పౌరాణిక గాధలలోనికి దిగజారిపోయాయి. గేయకవిత్వంలో బెంగాల్ ముందంజ వేసింది. రవీంద్రుడు వాడే భాష వ్యవహారికమే. అంటే అందరూ మాట్లాడుకొనే భాష, ప్రామాణిక గ్రంథప్రయోగాలకు విరుద్ధమైన భాష. వ్యాకరణ సూత్రాలు కాదంటూ ఈ రకమైన బెంగాలీ భాషను ప్రయోగిస్తాడని ఆయనను పండితులు నిందిస్తారు. ఇప్పుడు మద్రాసు యూనివర్శిటీ గ్రాంథిక భాషను సంరక్షించాలని చేస్తున్న ప్రయత్నమే, నాడు కలకత్తా విశ్వ విద్యాలయమూ చేసింది. కలకత్తాలో జనులు మాట్లాడుకునే భాషలో తప్పిస్తే, ఇంకొక భాషలో మనకు వ్యాకరణ గ్రంథం ఎక్కడ లభిస్తుంది? “తెడకొరి తెచ్చె” అనే పద ప్రయోగము మీద రవీంద్రునికీ, నాకూ సంభాషణ జరిగింది. ఆయన కొద్దిసేపాలోచించి, పూర్వకవుల ప్రయోగాలలో వుందని చెప్పారు. “3” అనేది జానపదుల భాషలో కనిపిస్తున్నదని నేను సూచించాను. గురుజాడలు యిద్దరు రాజులు 602