పుట:Gurujadalu.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాటా-మంతీ -5 యిద్దరు రాజులు రారాజు బంగాళాకువచ్చి, చేసిన చనువూ, చూపిన నెనరు కాంచితిని. కంటిని పట్నంపల్లె విరగబడి, ప్రేమార్థములైన చూపుటరులతో రేని నించి పూజించడు. వారీవీరి సరాగం పొలయల్క తీరిన ఆలుమగల కలయికను పోలినది. మన ఆంగ్లేయుల రాజు, ఒక చిన్న కరణం మొదలు వైసరాయి వరకూ, అధికారములకు చిన్నె. ఊరినాయుడు మొదలు మేటు తీర్పరి వరకూ, పద్ధతికి చిన్నె. ప్రజలను పీడిస్తూ, కాపాడే కనిష్టబు మొదలు దండిదండ నాయకుడి వరకూ, మగటిమికి, చిన్నగాని యీనాడు జాజిన్ ప్రభువు, మనపాటి మీద చిన్నెలుదాల్చి, దయాధర్మముల అవతారమై నిలిచాడు. బంగాళా విరాళికొనడము ఆశ్చర్యమా? ఇది వొక రాజు కథ : కవి రాజైన రవీంద్రునికి బంగాళా చూపిన మిక్కుటపు పేరూ, పొరలేని భక్తి, యేనాడేరాజెరుగును? ఆ మహాకవి భాషను యెత్తాడు. తలపుల నెత్తాడు. చెయ్యులనెత్తాడు. కీర్తి వెన్నెలల దిక్కులు నింపాడు. అది తనకీర్తి అని వంగదేశము గుర్తెరిగినది. అతడు తన సిరియని గర్వించినది. దేవుఁడని పూజించినది. చిత్పూర్ రోడ్డులో చిన్న సందొకటి మళ్ళితే యెదుట పొయిపొక్కిళ్ళవలె మూడు మేడలు కనపడతవి. అందులో మధ్యది, కలకాలమూ దేశ చరిత్రములో వన్నెకెక్కి వుండగలదు. అది రవీంద్రునిది. బ్రహ్మసమాజ మహోత్సవం రోజున, చీకట్లు కమ్మేవేళపుడు నేను వెళ్ళాను. గుమ్మం దాటితే బ్రహ్మాండమైన అంగణం. ఆ అంగణం చుట్టూ ఉన్నతమైన యెజ్జిటికల మేడ. మేడల చూర్లంట మెరుపు దీపాలు వెలుగుతుండినవి. అంగణమంతా సామాజికులతో నిండివుండెను. చూడబోయిన మా బోట్లమూ, టాగూరు కుటుంబమువారూ, దక్షిణపు ప్రక్క మేడమీద నిలుచుంటిమి. మా కెదురుగా సారసను నాదుల పూజా భవనం వుండినది. లోపల దీపములు లేమిని, వెలుగు చీకట్లు పెనుగులాడుతున్న ఆ పూజా మందిరములో బ్రాహ్మ సుందరులు ఆకులలో పండ్లవలెనూ, చదువు చీకట్లో మరుగున ముక్తి కాంతవలెనూ, కనీ కానరాక వుండిరి. గురుజాడలు 600 యిద్దరు రాజులు