పుట:Gurujadalu.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్యాశుల్కము

మంచి నాటకముల గనుట, జదువుట, కన్న విద్యాభిమానులకు ఎక్కుడు ఆనందముండ బోదు. అట్లు చూచుచు, చదువుచు, నుండునపుడు మనము భగవన్నిర్మాణమగు నీమాయా ప్రపంచమును మరచి కవి నిర్మాణమగు మరియొక మహా మాయా ప్రపంచమలో నానంద మగ్నులమై యుందుము. సాధారణ నాటకములెల్ల నిటుల నానందజాయకములగునపుడు ప్రతిభావంతులగు కవిశ్రేష్ఠుల నాటకముల మాట చెప్పనేల? మ.రా. శ్రీ. గురజాడ అప్పారావు పంతులు బి.ఏ. గారు రచించిన యీ నాటకమును పోలిన నాటకములు ఆంధ్రభాషలో లేవు. కథాకల్పన, పాత్రరచనా చమత్కృతి, రసపుష్టియు, నీ నాటకమున శ్రేష్ఠతరముగ నున్నవి. వీరికి హూణకవిశ్రేష్ఠుల కలాకౌశలము పూర్ణముగ పట్టుపడుటంజేసి, వీరు ఆపూర్వగ్రంథరచనచే నాంధ్రభాషా వధూటి నలంకరించిరి. ఈ నాటకము DTF 2వ సంవత్సరమున నైదకంములుగా రచింపబడి, రాజర్షులును, విద్యా భోజులును, పండిత పోషకులునునగు శ్రీ ఆనందగజపతి మహారాజావారలకు అంకిత మీయబడినది. అచ్చుపడిన కొద్ది వారములలో నన్ని ప్రతులును చెల్లుటయే కాక, పత్రికాధిపతులు ఈ నాటకమును వేనోళ్ళ పొగడిరి. ఇన్నాళ్ల వరకు రెండవ కూర్పు అచ్చొత్తించక పోవుటకు కారణము మన దేశములో గ్రంథముల నచ్చాత్తించి యమ్ము పడివాటుల భీతియే యని గ్రంథకర్తగారు ఉపోద్ఘాతమున వక్కాణించిరి. ఈ మాట యెంత నిజము! కొందరి స్నేహితుల ప్రోద్భలమున నీ రెండవ కూర్పిప్పుడచ్చొంతించిరి. రెండవ కూర్పులో నాటకమును మిక్కిలిగ మార్చి, అయిదంకములను యేడంకములుగ పెంచిరి. ఈ నాటకము గ్రామ్యభాషను వ్రాయబడి పండిత పామరులకు ఆనంద జనకమై యున్నది. గ్రంథకర్త గారు గ్రామ్యగ్రాంథిక భాషల తారతమ్యముం గూర్చి ఆంగ్లేయ భాషను విపులమగు క్రోడము వ్రాసి, నాటకమునకు ఉపోద్ఘాతముగా నచ్చొత్తి, వారి పాండిత్య ప్రకర్షను గనపరచిరి. వీరి నాటకమున గ్రామ్యభాష కెంతయో వన్నె తెచ్చి, రసానుగుణ్యముగ పలికించీరనుటకు సందీయము లేదు. ఇటులనేకదా ప్రాచీనకవులు ప్రాకృత భాషల యందు కావ్యములు వ్రాసిరి. ఆప్రాకృతములే యిప్పుడు బంగాళీ, ఓత్రము, మహారాష్ట్రము, మున్నగు భాషలుగా మారినవి. ఇప్పటి యీ వ్యావహారిక భాషలలోనే ఆయా దేశపు కవులు ఉద్ధంథముల వ్రాసి, ఆయా భాషలకు వన్నె తెచ్చిరి. ఆంధ్రమున గ్రామ్యగ్రాంథిక భాషల తారతమ్యమెటుల నున్నను, హాస్యరస ప్రధానములగు


గురుజాడలు

581

కన్యాశుల్కము