పుట:Gurujadalu.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గవర్నమెంటు ప్రెస్ లో శ్రీ ఆర్. నరసింహాచారిగారు నాగవర్మకృత కావ్యాలోకనమును కర్ణాటక భాషాభూషణమును కలిపి ముద్రించినారు. యింగ్లీషున విపులమైన ఉపోద్ఘాతము కలదు. అందులో ఛందోంబుధి వ్రాసిన నాగవర్మా, కావ్యావలోక నాదీ గ్రంథములు వ్రాసిన నాగవర్మా భిన్నులని ఋజువు పరచిరి. కేశరాజు రచించిన శబ్దమణి దర్పణమను వ్యాకరణమును మంగుళూరు బేసిల్ మిషన్ ప్రెస్లో కిట్టెలు దొరగారు ముద్రించిరి. యిందు సూత్రములు కన్నడ పద్యములుగానున్నవి. సూత్రాథమింగ్లీషున మార్జినులో నీబడినది. భట్టకలంక దేవుని కర్ణాటక శబ్దాను శాసనము విపులమైన వ్యాకరణము. దీనిని రైస్ (Rice) దొరగారు మైసూరు గవర్నమెంటు సెంట్రల్ ప్రెస్ లో అచ్చు వేయించిరి. సంస్కృతమున సూత్రములు, వృత్తి వ్యాఖ్య కూడా కలవు. పుస్తకము రోమను లిపిని కన్నడ లిపిని కూడా అచ్చు అయినది. కర్ణాటక కవిచరిత మొకటి ఆర్. నరసింహాచారి గారు, యస్. నరసింహాచారి గారు మైసూర్ వెస్లియన్ మిషన్ ప్రెస్ లో అచ్చు వేయించిరి. (Wesleyan Mission Press Mysore) ఇంగ్లీషున ఉపోద్ఘాతము కలదు. నృపతుంగుని కవి రాజమార్గము కె. పాఠక్ గారు మైసూరు గవర్నమెంటు ప్రెస్ లో అచ్చు వేసిరి. విపులమయిన ఇంగ్లీషు ఉపోద్ఘాతము కలదు. గ్రంథము రోమను లిపిని కూడా అచ్చువేసి యున్నది. కెటిల్ దొరగారు కన్నడ, ఇంగ్లీషు నిఘంటువు రచించిరి. గురుజాడలు 574 ఆంధ్రకవితాపిత - 1