పుట:Gurujadalu.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు వ్రాసిన పైపద్యములు కాక, శ్రీ రాయబహద్దర్ వీరేశలింగం పంతులు గారి లైబ్రరీని గురించి ఆంధ్రప్రకాశికకు వ్రాసిన పద్యములను కూడా నేను చదివితిని. అందు కొన్ని స్వారస్యములు కానవచ్చినవి.

1) స్వభాషను దేశమునందునన్ జీవవినాశ ఘోరమును బొందగనీయక.
2) పూజితమై కవీంద్రసుమపుష్కలమై ద్విజరాజపుంజమై చెలంగు నీ రాజమహేంద్ర పట్టణ వరస్థిత బాలక పుస్తకాలయోర్వీజము,
3) కల్పతరోపమానమై
4) నవనవ గ్రంథసంధానుడై యే కవి
5) అతులతేజసంయుతంబయి

ఈ సంస్కృత ప్రయోగములు మిక్కిలి సరళములు కావనుకుంటాను. ఇక తెనుగున కళలు ద్రుత ప్రకృతికములతో సంబంధించిన నియమములను వీరు సంస్కరించినట్లు కనబడుతుంది.

1) చాల యుపద్రవమయ్యె.
2) దేశభాషలందెల్ల యనుచు.
3) కథల నవ్వుల కల్లమి కలలబడుట.
4) భాషను చక్కగా.
5) అటుచేతురు గాక.

ఇది గ్రామ్యమునకు వృత్తి కల్పించుట కాదా! బలీయులు బలియురు కావలయును.

పై వ్రాసిన మాటలు, రాయవలసివచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. బాలకవులు ప్రతిభావంతులని వింటిని. మన ప్రాచీనకవుల గ్రాంథిక భాషలో రాయడమన్నది గరిడీవిద్య. భగవంతుడు కాళ్ళు యిచ్చినందుకు సుఖంగా నడవక గెడలెక్కుదురు; యేమి చెయ్యను?

రామాయణమును తెలుగు చేసిన మ. వావిలికొలను సుబ్బారావు పంతులుగారు కూడా ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో గ్రామ్యమును గురించి సరసముగా కొంత ముచ్చటించిరి. “కులటయగు మాతకన్న బతివ్రతయగు మాత యెక్కువ పూజ్యురాలైనట్లు, గ్రామ్యభాషకన్న లాక్షణిక భాషయే ప్రశస్తమని బుద్ధిమంతులెల్ల నంగీకరింతురు. అట్టి సలక్షణ భాష నుపేక్షించినచో గలుగు ననర్థములు పెక్కులు గలవు. గ్రంథవిస్తరభీతి సంక్షేపించెద. గాని తుద కాంధ్రపదము నామావశిష్టమగు”.

పరభాషల నేర్చుట కడుపుకూటి విద్యగా నెంచి ఇంకొక చోట రాయడంలో సుబ్బారావు పంతులుగారు పరభాషల నేర్చుట కేవల గర్ఘ్యము కాదనుటకు ప్రమాణముగా యీ కింది పద్యమును వుదహరించిరి:


గురుజాడలు

557

గ్రామ్యశబ్ద విచారణము