పుట:Gurujadalu.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇప్పుడైనా కడపెడలను ఆ శబ్దం, వినబడ్డం కద్దు. యీనాడు కొందరు పండితులూ, కవులూ అట్టిదీయే, ఆ గ్రామ్యోక్తివొకటి. గ్రామ్య భాషను గురించి వినియోగించుదురు.

వారిలో తెగబడి దీవించినవారు శ్రీ బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు, వారు వ్రాసిరి -

గీ. అజుని సృష్టి విచిత్రమేమందు సౌర
ఘనుల నిరుపమ పాండిత్యగరిమమేమొ
అంబురాసిలో గాలకూటంబు వోలె
గ్రామ్యభాష కొత్తగా ప్రబలే నిపుడు.

గీ. నీరత మవలక్షణంబుల గడుచుండి
ఆంధ్ర భాషతోఁబోరాట మాడదొడగే
లంజసంతతి సొత్తుకై లావుమించి
మౌరసునీతోడ బోరాటమాడునట్లు.

సీ. నవనవాలంకార నవ్య వైభవమన్న
దలనొప్పియట దీని సరణి యేమొ
మహిని వ్యాకరణోక్తి మాటలాడుటయన్న
వాంతి నట దీనీ వరుసయేమొ
సాహిత్య విధ్యుక్త సల్లక్షణములన్న
నురిబోసికొను దీని సరయేమొ
వివిధ భవ్యాకార వృత్తగీతములన్న
మూలడాగును దీని లీలలేమొ

గీ. తగుదునని తానుగూడను తగవులిపుడు
సేయగాబూనె దేన్గుతో వేయి యేల
ఆంధ్రభాషా వధూటీ గృహాంగణమున
దాసియై మెలగుటకు నైన దగునె చెపుడ.

Appearances are deceptive-అనీ వొక ఆంగ్లేయోక్తి కలదు. తిట్టగానే, అసూయ కాబోదు. భూషించగానే, అనురాగం కాబోదు. ముద్దుతిట్లూ, భక్తి తిట్లూ, రస భరితములు. నారాయణమూర్తిగారి తిట్లు కూడా అట్టివేమో యని సందేహం పొడముతున్నది. లేని యెడల అవలక్షణములు వారి కవిత్వమందు వారేల వాడుదురు?


గురుజాడలు

556

గ్రామశబ్ద విచారణము