పుట:Gurujadalu.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెడ్డ తలపులు ఉండవు. సొగసైన స్త్రీల పొందు కోరేవాడికి అవకాశం తటస్థించినప్పుడు చెడ్డ తలపు వస్తుందా రాదా అని ఆలోచన. ఆ అవకాశానికి అవకాశం యివ్వని వాడె ప్రాజ్ఞుడు".


5

"నాకూ నీవూ, నీ స్నేహితుడు రామారావు మరొక గొప్ప వుపకారం చేశారు. మీ మాటలవల్లా చేష్టల వల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకొన్నాను. ఆలోచించుకోగా ఆనాటి నుంచి కళ్లెం వదిలేశాను. నా పెళ్ళాం బహు బుద్ధిమంతురాలు. యిచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు. యెక్కడికి కావాలిస్తే అక్కడికి వెళ్ళమన్నాను. యెవరిని కావలిస్తే వారిని చూడమన్నాను. యెక్కడికి వెళ్ళకోరలేదు. యెవర్నీ చూడకోరలేదు. నాకు నీతో లోకం. మరి యెవరితో యేం పనంది. అలాగే సంచరించింది.

దాని చర వొదిల్చావు. అది నా చర కూడా వొదలడానికి కారణమైంది. హయ్యరు మాథమిటిక్సు చదువుకున్నావా? లేదు పోనియ్యి."

కాల్‌బెల్‌ టింగ్‌ మని వాయించాడు. కీలు బొమ్మలాగా మెటిల్డా ప్రవేశించి గుమ్మం లోపున నిలబడింది.

"కాఫీ యియ్యి"

బల్ల మీద రెండు గిన్నెలతో కాఫీ అమర్చింది.

"నీక్కూడా పోసుకో"

మొగుడు కేసి "కూడునా యిలాంటి పని" అనే అర్థంతో చూసింది.

"పర్వాలేదు నువ్వు కూడా తాగు. మన స్నేహితుడు" అన్నాడు. గాని ఆమె తనకు కాఫీ అమర్చుకోలేదు. ప్రక్కన నిలుచుంది.

"పోనియి. కూచో" అన్నాడు, కూచోలేదు. నేను భార్తాభర్తల సరాగానికి సంతోషించాను. నేను అందుకు కొంత కారణభూతుణ్ణి కదా అని మెచ్చుకున్నాను.

కాఫీ పుచ్చుకున్నంత సేపూ అతను చెప్పిన మాటలు తన భార్యకు చదువు చెబుతున్నానినీ, అమేషా రామాయణం, భారతం చదువుతున్నట్టుందనీ, తను ఫలానా, ఫలానా చోటికి తీసుకువెళ్ళాననీ, కులాసా దిలాసా చూపించానని. అంతట నా చదువు మాట కొంత. చాలా విద్వాంసుడని కనుక్కున్నాను.

వెళ్ళిపోయేముందు "మరి నువ్వు వెళ్ళిపో"