పుట:Gurujadalu.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతము : విమతము

(గోలకొండ పాదశాహీ వారి పర్మానుల సీలు యిచ్చట విప్పబడుటం జేసి దీనికి సికాకోల్ లేక చికాకోల్ అను పేరు కలిగెనని యిక్కడి వారందురు గాని, అది నిజము కాదు. ఈ పట్టణము బహు ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళము. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేరు మహమ్మదు పెద్ద మసీదును కట్టెను. నిజమిది)

ఒక సంవత్సరమున కార్తీక మాస శుక్లపక్ష దశమి నాటి సాయంత్రం ఇద్దరు బ్రాహ్మణులు, ముప్పది యేండ్ల ప్రాయపుటతడొకడును, యిరువది యేండ్ల లోపు వయస్సు గల యతడొకడునూ తూర్పు నుండి పట్టణము దరియ వచ్చుచుండిరి.

నారాయణభట్టు మోము అత్యంత సంతోషముతో వికసితమై యుండెను.

“పుల్లా! మా వూరొచ్చాంరా. యిట్టి వూరు భూప్రపంచములో వుండబోదురా. కాళిదాసు అవంతిని ఉద్దేసించి చెప్పిన మాటలు దీనియందు వర్తిస్తున్నాయిరా, యేమి నది, యేమి వూరు! ఇది శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము, యెట్టి మహాక్షేత్రమని చెప్పను, అదుగో -

నారాయణభట్టు నిశ్చేష్టుడై నిలిచి, కొంత తడవు మాటాడకుండెను.

“యేమి స్వామీ! యేమి స్వామీ!” అని పుల్లంభట్లు అడుగ “యేమి చెప్పనురా పుల్లా! కోవిల గోపురం మాయమై పోయిందిరా!” అని నేలపై కూలబడెను.

“చెట్ల చాటునుందేమో స్వామీ?”

“యే చెట్లు కమ్మగలవురా, పుల్లా! ఆకాశానికి నెత్తుటిన ఆ మహా గోపురాన్ని, మనస్సు చివుక్కుమని పోయిందిరా పుల్లా! యీ పట్నానికీ మనకీ రుణస్య చెల్లిపోయింది. రా తిరిగీ కాశీ పోదాం .”

“గోపురం కోసవాఁ యిక్కడికి వచ్చాం స్వామీ? యెడతెగని మార్గాయాసం పడి యీ . నాటికి దేశం చేరాం గదా; మళ్ళీ వెంటనే పోవడానికి యినప కాళ్ళు కావు గదా? లెండి, నా మాట వినండి; దాని సిగ్గోసిన గోపురం, గోపురవఁన్నదే మీకు కావలసి వుంటే మా వూరు రండి.

గురుజాడలు

544

మతము : విమతము