పుట:Gurujadalu.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కొండు : తురకాడి కమ్చీ దెబ్బలు తప్పించుకోవడం కష్టంగా వుంది. బ్రహ్మ హత్య జరిగిస్తే బ్రహ్మ రాక్షసినై పీక్కుతింటాను.

మంజు : కంసాలి వీరనాభాచారి చేత మారణహోమం చేయిస్తాను.

కొండు : అంతటి దానవగుదువు. (ఆత్మగతం, కిందటి మాటులాగ కేకైనా వేతునా యెవరయినా రానైనా వస్తారు)

మంజు : “ధర్మం కాదిది మంజువాణి వినుమా దాగుంట”

కొండు : నువ్వూ వాడితో కలిశావు సాహెబ్ అభీ ఛోడ్ తోకెల్లీఫిర్ నై ఆయంగే.

సాహె : బొమ్మన్ బాత్ ఝూటా బాత్ అని (కమ్చీ చప్పుడు చేయును)

మంజు : దీపంయెందుకు ఆర్పేశావు. ఇదిగో దీపం తెస్తున్నాను. ధైర్యం అవలంబించండి.

కొండు : చీకట్లో కొరడా దెబ్బలు తప్పించుకొంటు న్నాను. దీపం మాత్రం తేకు ధర్మాత్మురాలివి. వీధి తలుపులు మట్టుకు తీసెయ్యి,

మంజు : (దీపం పట్టుకువచ్చి సాయిబు వెనక నక్కి శాస్తులు గారు! మంచం క్రింద నుంచి విజయం చెయ్యండి.

కొండు : సాయిబు, సైతానా? నిజమైన మనిషా?

మంజు : పైకి వస్తే మాట స్పష్టమవుతుంది.

కొండు : సాహేబ్ - సాహేబ్ కంచన్ ఘర్కుకబీ నైజాయంగే.

సాహె : దాలాఝూడ్ మే తుమ్ రహకర్ మెహెర్ చోడ్దేయంగే.

కొండు : (ఆత్మగతం) వీడి దగ్గర యక్షిణీ వుందిరోయి నాయన అన్ని రహస్యాలూ వీడికి వెల్లడే. గూనలో కాసులు దొబ్బింది. ఈ గండం గడుస్తే డబ్బుమాట చూసు కుందాము. (ప్రకాశం) మహరాజ్ లేజియే ఆప్‌కా పాం పకడ్తే.

సాహె : బొమ్మన్ పాంపకడ్తే.

కొండు : సమయం వస్తే గాడిద కాళ్లు పట్టుకోమన్నాడు. ఏం చెయ్యను.

సాహె : అచ్చా గులామల్లీ దర్వాజా ఖోలో - దౌడ్ కర్కె చెలో..

కొండు : (చెవల పిల్లిలాగ మంచం కింద నుండి జరిగి కుప్పించును. పరుగెత్తుటలో గుమ్మము తగిలి జారిపడును. ) కందులగూనా యెంత చేస్తివే...?

(తెరదించవలెను)

గురుజాడలు

521

కొండుభొట్టీయము