పుట:Gurujadalu.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండు : (ఆత్మగతం) ఘోర ప్రమాణాలు చెయ్యమంటాడు. యెవరిశక్యం, కందుల గూనలో కాసులు యెవడు వదులుకోగలడు? వీధిలో చడి అవుతూంది. ఓ కేక వేస్తునా.

సాహె : పుకార్ కర్నే తొగలాకాటు దేయంగే (అని గొంతుకు చేత్తో పట్టుకొనును.)

కొండు : (ఆత్మగతం) మనస్సులో మాట మనస్సులో వుండగానే పోలుస్తాడు. మనిషి కాడు దెయ్యం అనుకుంటాను (ప్రకాశం) యిదిగో జందెంపడ్కె శపథం కరేంగే, హం కంచన్కు ఘర్కునై జాయంగే - దేఖోజీ డర్తె హమ్కు బుఖార్ ఆయ (అని చెయ్యి చూపును)

సాహె : అచ్చా! కెబీ కంచన్కు ఘర్కు జాన్‌తే గల్లా కాట్‌గా (అని నిష్క్రమించును.)

కొండు : చలి వొణుకు వచ్చాయిరా బాబూ పార్వతీ, కుంపటి తేవే కుంపటి-కుంపటి (అంటూ నిష్క్రమించును)


కొండుభొట్టీయము

తృతీయాంకము

అష్టమ రంగము

{{center|(కొండుభొట్లు యిల్లు. రాత్రి భోజనం చేసి బట్టలు కట్టుకొని పైకి వచ్చి గుమ్మం అవతల నిల్చి)

కొండు : తురకాడి దెబ్బ పదిహేను రోజులు మంచంయెక్కించింది. మంజువాణి ఫికర్లేదు. ఇన్నాళ్లకు ఆశ్రయించి యెంతో సహాయ సంపత్తి చేసినాను. శాస్తులు గారికి యెలా వుందని మాటవరుసకైనా వర్తమానం పంపించలేదు. పంతులు కూడా అదే పద్దతి అవలంబించాడు. మంజువాణ్ణి వదిలేసి యేకపత్నీవ్రతుడయినాడుట. దెబ్బకి దెయ్యం వెరుస్తుందన్నారు. గాడిద కొడుకు నన్ను కొట్టాడయ్యా... యీసర్కి గాయం మానలేదు. వీళ్ళు మాగడపలోకి రావద్దంటే మాత్రం.... కందులగూనలో కాసులకి కామమ్మ సరసాలకి దూరమై పోతాం. మంజువాణికి యేమిటి అపకారం చేశాను. ఒక్క తుమ్మలపాలెం వాడు డబ్బియ్యకుండా వెళ్ళి పోయినాడు. అదొకటిన్ని సాయిబు కొంచం భయోత్పాతం చేశాడు. తలుపుకి మాత్రం కించిత్తు మరమ్మత్తు తటస్థించి వుండవచ్చును. అయితే, ఆ అల్లరి తురకాడు చేసిన దేహశుద్ధి తోటి పంతుల ప్రాపకం పడిపోయిందని కోపం వుంటే వుండవచ్చును. పైపత్యంలో వున్నాను. ఇంకా దేహానికి జవసత్వం రాలేదు. తొందర పాటు మనిషి... కమ్చీ తిరిగేసిందంటే మళ్లా మంచం

గురుజాడలు

519

కొండుభొట్టీయము