పుట:Gurujadalu.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కొండుభొట్టీయము

తృతీయాంకము

సప్తమ రంగము

(కొండుభొట్లు యిల్లు)

అరుగు మీద బిచాణ పరచుకొని కూర్చుని పొడుం పీల్చి

కొండు : ఇవాళ యేమి ప్రమాదాలు వచ్చాయి. పంతులు కొట్టిన దెబ్బ రక్తం బొటబొట రక్తం కారింది. గాడిద కొడుకు నిద్దరపోతే తురకాడు కల్లో వస్తాడేమో అని భయంగా వుంది. రామస్కంథం, హనూమంతం, వైనతేయం, వృకోదరం, శయనేయస్సరే న్నిత్యం దుస్స్వప్నం తస్యనశ్యతి. (నలుదిక్కులా కలయజూచి పడుకొనును)

(సాహెబు ప్రవేశించి)

సాహి : ఉఠోజి

కొండు : (ఆత్మగతం) ఓర్నాయన సాయిబు కాబోలు... నిజమా ? కలా?

సాహి : ఉఠోజి, (అని గట్టిగా వెన్ను మీద చరచును. )

కొండు : (లేచి) చంపేశావు.

సాహి : కంబన్ ఘర్కు ఫిర్ చల్నా ఆప్.

కొండు : ఆహా; .... హాహా....హి... ఖురావఁద్ కంబన్ ఘర్మే బడా బొమ్మన్ సైతాన్ హై హమ్‌దర్తె

సాహె : కూచ్ ఫర్వానహి. బొమ్మన్ సైతాన్‌కు మార్ దేయంగే.

కొండు : హమ్ బొమ్మన్ హై కంచన్ ఘర్కు చల్నా జొహుత్ దోష్ కర్కి అమార శాస్త్రమే హయి.

సాహె : తుమ్‌కు కోన్ శిఖాయ?

కొండు : అమార బాప్ శిఖాయ.

సాహె : ఆజ్ తక్ ఆల్ కంచన్కు ఘర్ నై చల్తీ

కొండు : కంచన్‌కు ఘర్కు కిఖీనై జాయెగ.

సాహి : అయిసాత్ తుమారీ దేవత్సే ప్రమాణ కరో.

గురుజాడలు

518

కొండుభొట్టీయము