పుట:Gurujadalu.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కా : యేమిటండి పంతులుగారు?

పంతు : యేమీ లేదండి ... శాస్తుల్లూ! వీడ్నెందుకు తీసుకొచ్చావు?

కొండు : సాయీబు మళ్ళా వస్తాడేమో అని భీతాహం చేత తీసుకొచ్చాను.

పంతు : సాయిబు యింగువ అమ్మకానికి కాదూ వచ్చాడు?

కొండు : వెధవ అందుకే వచ్చానన్నాడు (మెల్లిగా) సానివాళ్ళ మాయలు నాకేం తెలుసును.

అక్కా : యెందుకట్టే చర్చ పంతులుగారు. యిక్కడ వుంటారా? యింటికి వస్తారా?

పంతు : యిహెంధుకు యిక్కడ యింటికి వెళ్లి పోతాను.

మంజు : (మంజువాణి పంతులు వెనుక నుంచి ప్రవేశించి) అక్కాబత్తుడు గారు మీరు వెళ్ళిపొండి.

పంతు : (కుంటుతూ లేచి కమ్చీ తీసి)

ఆ యింగవమ్మే తురకాడికోసమేనా యీ ముస్తాబంతా?

(అని కమ్చీతో మంజువాణిని కొట్టును. అక్కాబత్తుడు కొరడా చెయ్యి పట్టుకొని)

అక్కా : శాంతించండి పంతులుగారు.

మంజు : (చేతిలో కొరడాలాగికొని రెండవ జబ్బ, తనచేత్తో పట్టుకొని) పంతులుగారు కారు వీరు అమ్మ గారు. ఆడవాళ్ల మీదికి సూరులు -సాయిబు దగ్గిర లేకపోయిందీ పౌరుషం నేను వేశ్యను నా వృత్తి ధర్మం నే మానను. మీ యింట్లో వున్న సంసారి వేశ్యను ఖాయిదా పెట్టుకోండి..

పంతు : యేమిటి పేలేవూ? చూడు (అని పెనుగు లాడును)

కొండు : ఊ.... ఊరుకొమ్మని మంజువాణికి సౌజ్ఞ చేయును.

మంజు : పంతులుకి యింకా గీటణగలేదు. వెంకీ! యిక్కడే వీధిలో వుంటాండు తీసుకురా.

వెంక : పిలవమన్నావా యేమిటి?

కొండు : వెధవాయ! వూరుకోవోయి- సాయిబు మళ్లీ వస్తే చంపేస్తాడు. పంతులుగారు దయచెయ్యండి.

(అని పంతులు చెయ్యి పట్టుకొని లాగును. పంతులు కొండుభొట్లు గుమ్మము దాటుతూండగా చురచుర చూస్తూ, మంజువాణి పంతులు వీపు మీద ఒక దెబ్బ తిరిగి చూచిన కొండుభొట్లు వీపు మీద ఒక దెబ్బ వేసును.)

(తెర దీంచవలెను)

గురుజాడలు

517

కొండుభొట్టీయము