పుట:Gurujadalu.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సాహె : అరే బహుత్ బడా సైతాన్ హై. ఇహాసె చెల్జానా (వీధి తలుపు తియ్యబోగా రాదు.. తలుపు బలత్కారంగా తీసి వెళ్లిపోవును. )

(తెరదించవలెను)


కొండుభొట్టీయము

తృతీయాంకము

పంచమ రంగము

(అక్కాబత్తుడి యింటి అరుగు : వెంకన్న, కొండుభొట్లు అక్కాబత్తుడు ప్రవేశించును)

కొండు : సాయిబు పంతుల్ని చావగొట్టేడు.

అక్కా : యెక్కడ?

కొండు : మంజువాణి యింట్లో

అక్కా : మీరెందుకున్నారక్కడ?

కొండు : పంతులుగారి యింట్లో ఆడవాళ్ళకు పురాణం చెప్పి వస్తూండగా మంజువాణి ఇంట్లో గడబిడ అవుతు వుంటే తొంగి చూశాను.

అక్కా : అయితే యేం చయ్యమంటారు? కనిష్టీబుల్ని పిల్చుకు వెళ్ళదాం.

కొండు : వొద్దు బాబు! లేనిపోని అల్లరి చెయ్యకండి! తమరు దయచేస్తే చాలును.

అక్కా : తురకాడు నాకు దేహశుద్ధి చేస్తే?

కొండు : వెళ్ళిపోయినాడు.

అక్కా : కొండుభొట్లుగారు! లాంతరు తెండి. నేను చేతికఱ్ఱ పట్టుకు వస్తాను.

(ముగ్గురు నిష్క్రమింతురు)


కొండుభొట్టీయము

తృతీయాంకము

షష్టమ రంగము

(పంతులు మంచమును జారబడి జాపోయుచుండును. అక్కాబత్తుడు చేతికఱ్ఱయు - వేంకన్న లాంతరును పట్టుకొని కొండిబొట్లు ప్రవేశించును)

గురుజాడలు

516

కొండుభొట్టీయము