పుట:Gurujadalu.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంక : నేను వైద్యుణ్ణి కాను.

అక్కా : మందనగా వుపాయము. యీవేళ పంతులు తండ్రి తద్దినం. అంచేత మంజువాణి యింటికి రాత్రి యీ సమయము చూచి కొండిభొట్లు తోళ్ళ సాయిబుని మంజువాణి యింట్లో ప్రవేశపెట్టబోతున్నాడు. నువ్వు తిన్నగా వెళ్ళి ఈ మాట పంతులుగారితో చెప్పి పదకొండు ఘంటల ప్రాంతాన పెరటి గోడ గెంతి అమాంతంగా లోపలికివెళ్లమను. నేను వీధి గుమ్మం తలుపు గొళెం పెట్టుతాను.

వెంక : తురకాడుంటే పంతులుకేమి?

అక్కా : చూస్తూగాని నీకే తెలుస్తుంది.

(తెర దించవలెను)


కొండుభొట్టీయము

తృతీయాంకము

చతుర్థ రంగం

(మంజువాణి ఇల్లు)

(మంచంమీద కూర్చుని హుక్కా పీలుస్తూ సాహేబు గారు కింద తివాచీ మీద కూర్చుని కొండుభొట్లు ప్రవేశించును.)

సాహె : క్యో! దేర్ హోతాజీ

కొండు : పోషక్ బనాతే మహరాజ్.

సాహె : క్యాపోషక్ - ఆన్‌కో పోషక్ కర్తే రాత్ బహుత్ హోగయ, తోడా వేదం బోలోజీ.

కొండు : (ఆత్మగతం) తురక వెధవ వేదం చదువమంటున్నాడు.

(ప్రకాశం) సాహేబు గారు వచ్చారు.

మహదొడ్డవారువై!
మడదుక్కలాగ వున్నారు!
గొడ్డుమాంసము తిందురు!
లెంపకాయ ఆచీకొట్తేను
దవడపళ్ళూడిపోవును ఇత్యమరః

గురుజాడలు

513

కొండుభొట్టీయము