పుట:Gurujadalu.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గంగా : నేను కూడా యేకాక్షర నిఘంటు చూచి కొన్ని అర్థాలు మనవి చేసుకుంటాను.

గిరీ : నేను ఒరిజనల్ (Original) అని మామగారు శలవిచ్చారు గనుక నేనో కొత్త అర్థం చెప్పుతాను. 'షా' మీద 'కా' యెక్కిస్తే 'భిక్షా' అని అవుతుంది. ఆపైని అర్థం బహు సుళువుగా వస్తుంది. గాలీ, సూర్యుడు వగైరాలు ముష్టి కోసం సంచారం చాస్తారని సమన్వయం అవుతుంది. “భిక్షా” అన్నది 'భీ” అనే ధాతువులో నుంచి వచ్చిన పదం కాదు. అది యిండో ఆర్యన్ (Indo Aryan) మాట. “వ” “చ' యోరభేదః అన్నసూత్ర ప్రకారం యింగ్లీషులో విష్ అనే మోస్తరుగా తేలింది. విష్ (Wish) అనగా యిచ్చ. ఇచ్ఛా మాత్రం భోజనం దేని కోసం ముష్టి అంటే భుక్తి కోసం. “భుక్తి భిక్ష మీయవే” అనీ త్యాగరాయిలు పాడలేద. - లోకంలో కూడా మనం చూడమా! గవర్నమెంటు వారు యింత భిక్ష పడేస్తే గదా మామగారి వంటి గొప్ప గొప్ప ఉద్యోగస్తులు నౌఖరీ చేస్తారు.

గంగా : వేదంలో అక్షరాలు మార్చడానికి వీలు లేదండి.

గిరీ : అర్ధము మార్చడానికి వీలుందండీ?

గంగా : శాస్తులు గారు! మీకు తెలియదండీ. మా వాడు చెప్పింది చాలా సబబుగా వుంది. యీ వేళకి సమాప్తి చేశాం. శాస్తులు గారు మనలో వారే. మనం స్వేచ్చగా మాట్లాడు కోవచ్చును. రావుజీ! నీ హాస్యరసమునకు కొంచెం కళ్ళెం పెట్టి ఒక్క అర నిమిషం సీరియస్ (Serious) గా వుంటే చాలా ఒబ్లైజు (Oblige) అవుతాను.

గిరీ : మామ గారి శలవు శిరసావహించి, గుడ్లగూబ వలె బుద్దీగా కూర్చుంటాను.

ది.రాజా: యీ విధవా వివాహం తాలూకు హిక మత్తు యావత్తూ మీ క్యెప్తాను గారి చేతులోవున్నది. గనుక, 'తూ' 'చా'లు పోకుండా యావత్తూ పరిసమాప్తి అగుననే నమ్మకము నాకున్నది. నేను నిన్నటి దినం కేశవరావు నాయుడు గారితో మాట్లాడినాను. మాధవయ్య గారిది వరకు ... చేయుచున్న శాస్రోక్త పద్ధతి త్రోసి, బ్రహ్మ సమాజ మత ప్రకారం యిటు పైని విధవా వివాహములు చేయించుటకు వారిని గట్టిగా పుర్లెక్కించాను. నీ సహాయం కూడా వుంటే పార్వతమ్మ వివాహం మన పట్టణంలో ఫస్టు (first) బ్రహ్మ సమాజ విడోమారోజి (widow marriage) గా వుంటుంది. చేసుకునే కుర్రవాడు బ్రహ్మ సమాజ మతస్తుడు గన్క రేషనల్ కన్సమేషన్ (Rational consummation) అనేది మనం ప్రతిష్ఠించిన వారమగుదుము.

గిరీ : సందేహము లేమయ్నీ అడగవచ్చునా?

గురుజాడలు

506

కొండుభొట్టీయము