పుట:Gurujadalu.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



లున్నవిగాని కొంచెం పెద్ద పిన్నా తారతమ్యం మరిచి హాస్యరసంగా మాట్లాడుతాడు. తుంటరి ... అతనువచ్చే సర్కి పుస్తకం చదువుతూ వుందాము. “భీష్మాత్ వాతఃపవతి - భీష్మోదేతి సూర్యః - భీష్మాదగ్నిశ్చండశ్చ.

గిరీశం: (ప్రవేశించి.)

ఆ స్వరాన్ని యెందుకు సాగదీస్తున్నారు. శాస్తులుగారి చేత చదివించండి. మీరు అర్థం వ్రాయండి.

ది.రాజా: (Dam it) (అప్పుడే ఆరంభించాడు. )

బి.ఏ. ఆ భాషలో ప్యాసు అయినాడు. వాడికి సంస్కృతంలో మంచి ప్రవేశం వుందండి. తండ్రి ఉపనిషత్తులు కూడా చెప్పించాడు.

గిరీ : మా గ్రామములో ఒక కోమటి ఉండేవాడు. ఆయన పురుషసూక్తం పారాయణ చేస్తూ వుంటే నూతులో కప్పలు బుఱ్ఱపైకెత్తి అరిచేవి.

గంగా : మండూకప్లుతం - వేదంలో స్వరం కూడా వుంది.

గిరీ : బ్రాహ్మలు సోమపానం చేసి తొలకరి వేదపారాయణ చేస్తే తొలకరి కప్పల అరుపుల్లా వుంటుందని ఋగ్వేదంలో ఉపమానం కల్పించారు. తొలకరివాన కురిసినతరవాత రాత్రివేళ కప్పలు మేళంగట్టి తరహాతరహాలుగా గానం చేస్తూవుంటే అదిఒక ఆనందంగా ఉంటుంది.

ది.రాజా: (Serious subject) సీరియస్ సబ్జెక్టులోనయినా హాస్యం విడనాడజాలవుగదా ! రావుజీ!

గిరీ : మామగారు! గుడ్లగూబలా గాంభీర్యంగా కూర్చుంటాను. యేం శలవు?

ది.రాజా: ఉపనిషద్వాక్యము పరిసమాప్తి చేసి మాటాడుకుందాము.

శాస్తులుగారు! అబ్బీ నువ్వు కూడా విను. నీ బుద్దీలో (originality) ఒరిజినాల్టీ వుంది. భీష్మాత్ వాతః పవతే” అన్నాడు. దేవునికి భయపడి వాయువు వీస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. అని యీ ప్రకారం చాలామంది తాత్పర్యం చెప్పుతారు. భయమనేది భగవంతుని యందు క్రౌర్యం కనపరుస్తుంది. భక్తి వల్ల దేవతలు వారి వారి పనులు చేసినారంటే కొంత స్వారస్యంగా వుండును. మా వాడు (గిరీశం వంక చూసి) భయం చేత చెయ్యమంటే యే పని చెయ్యడు. “భీషా” అనే మాటకు మరి యేదయినా అర్థం చేప్పితే బాగుంటుంది. యూరోపియన్లు వ్రాసిన డికషనరీలు చూదాం.

గురుజాడలు

505

కొండుభొట్టీయము