పుట:Gurujadalu.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గారిది వైదీకపురస్తా - అందులో వేగినాటి సన్యాసం ఆయ్నకు దేశాన్ని పట్టి అబ్బింది. గ్రంథాలయితే చాలా రాశారు.

రాజా : పండితులైన మీరూ అలా అనడం ఆశ్చర్యంగా నున్నది. పిట్టకథలు పిచ్చిక కథలు తిట్లూ గ్రంథము లంటారా? ఇంగ్లీషులో సోలిడ్ బుక్ (Solid Book) అంటారే అనగా ఉద్గ్రంధము. అది మనము వ్రాస్తూన్నాము. మన భగవద్గీత ఆంధ్రభాషకు వజ్రకిరీటమని పేపరు వాడు రాశాడు. శైలి భేదం చూశారా మాధవయ్య గారి వ్రాత - ఊక - పేలపిండి మా శైలి అలంకార భూయిష్టమైయుండును. వాక్యములనడక సంగీత గమనము ననుకరించును. పామర జనులకు ఉత్కృష్ట వస్తుగుణ గ్రహణం వుండదు. మన గ్రంథములు యెంత సొగసుగా నచ్చొత్తించినను కొనువారు కానరారు. జమీందార్లు తమ యుద్యోగస్తుల మేలుకోరి కాపీలధికముగా గొని తాము వారికి పంచి పెట్టిన జమీందారీలు బాగగును. దేశములో జ్ఞానాభివృద్ధికి మార్గమగును. ఒకమారు వెళ్ళి ఉద్యోగావస్తలో పూర్వ పరిచితులయిన వారిని చూడవలె. యెక్కడయినా మంచి సంస్థానంలో దివాన్‌గిరీకి కుదురుకుంటేనే గాని అధికారం చేసే అలవాటు పోయి యేమీ తోచకుండా వున్నది.

గంగా : ప్రజలికి అదృష్టం పట్టాలి కదా!

ది.రాజా: దివాన్ గిరీ చేస్తే చెన్నపట్టపు వకీళ్లతో పలుకుబడి కూడా వుంటుంది. కౌన్సిలు మెంబరు పనికి సహాయ భూతంగా వుంటారు. యీజిల్లాలోనే కొంచెం ప్రజలని రంజింప చెయ్యడాన్కి సంఘ సంస్కారంలో మనంకూడా వేలు పెట్టితేనే కాని యిక్కడి వాళ్లు మనకు వోట్లు యివ్వరు.

(నౌఖరు ప్రవేశించి)

నౌఖ : గిరీశం పంతులుగారు వచ్చారు.

ది.రాజా: రమ్మను (గంగాధర శాస్త్రీతో)

ఇతడు నా బాల్యస్నేహితులయ్ని యుగంధరరావు పంతులుగారి కొమారుడు. చిన్న నాటి నుంచి యెరుగుదును. బి.ఏ. ప్యాసుఅయినాడు. తండ్రి ఆర్జించిన ధనం పెట్టి బ్రతుకుతున్నాడు. ఇతనిని సంఘ సంస్కారంవారు కెప్తాను అంటారు. సాహసౌదార్యాలు గల మనిషి కోటి విద్యలున్నాయి. నాటకాలాడుతాడు. పాడుతాడు. గారిడీ చేస్తాడు. దొర్లకి యితనంటే సరదా. తండ్రిచేసిన మొదటి వివాహం భార్యాపోయింది. పిల్లలు లేరు. తిరిగీ వివాహం లేదు. చేసుకుంటె మరెవరయినా పిల్లను యిచ్చివుందురు. అర్ధరాత్రివేళ యెటువైపున పిలచినా రెండువేలమంది వెనుక కూడుతారు. గుణయోగ్యత

గురుజాడలు

504

కొండుభొట్టీయము