పుట:Gurujadalu.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మీటింగులోనయ్నీ మాకే వస్తుంది. యిటు పైని మా నమ్మకములననుసరించి పని చేసి చూస్తాము. థేంక్యూ వెరిమచ్ ఫర్ ది ఎడ్వైస్. (Thank you very much for the advice). :

ది. రా : నేను యెడ్వైసు (advice) యివ్వలేదు. యివ్వజాలినంత వాడిని కాను. రిఫారమ్ (refom) విషయమై నేను తమకు యెడ్వయిజు (advice) యేల? ఈ హంశము మన ప్రసంగములో ఉపమానముగా తెచ్చినాను. దీని మాటకేమి? తాము సవబు ప్రకారం నడిచేటప్పుడు లోకం అంతా మీ పట్ల వుంటారు. మనం అనుకుంటూ వున్న ప్రస్తావన రిలిజన్ రేషనల్‌గా (religion rational) వుండకుంటే అన్యమతస్కుల యొక్క నాస్తికం యొక్క ఢోకాకు నిలవగలదా.

కేశవ : అవును.

ది.రా : నేను యిప్పుడు తమ దర్శనానికి రావడము కారణమేమంటే తమతో ముచ్చటించడమనే సంతోషమలా వుండగా ఆదివారం రోజున, మా తోటలో నలుగురు ఫ్రెండ్సు (friends) కి టీపార్టీ యిస్తాను. ఆహూయము చేయుటకు వచ్చితిని.

కేశవ : చీటీవ్రాస్తేవస్తానే నా కోసం యింత శ్రమ తీసుకున్నారు.

ది.రా : తామును చూడడపు ఆనందమో తమతో ముచ్చటించుట వలన గలుగు జ్ఞానోత్పత్తియో? గుడ్ బై (Goodbye) (Shake hands చేసుకుందురు.)

కేశవ : గుడ్ బై.

(యిద్దరూ నిష్క్రమింతురు.)


కొండుభొట్టీయము

తృతీయాంకము

ద్వితీయ రంగము

(రాజారాంగారి కచేరి గది)

(దివాన్ బహుద్దూర్ రాజారాం గారు, గంగాధర శాస్త్రి ప్రవేశించును.)

ది.రా : ఈ పటుపటాంగములో యెవరు గెలుస్తారంటారు?

శాస్త్రి : తాము దీవాన్ బహద్దర్లు - మాధవయ్య గారు రావు బహద్దరు - ఇద్దరి తారతమ్యము కంపెనీ వారు యెంచేవుంచారు. తాము సార్థక నాములగు మంత్రులు - మాధవయ్య

గురుజాడలు

503

కొండుభొట్టీయము