పుట:Gurujadalu.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఖర్చు పెట్టాన? లేకుంటే నౌఖర్లు యెవరయినా చెపాయించేశేరా? ఈ రెండు కాసులు దీనికి యిచ్చేస్తే యింటికి చేరే సాధనమేమిటో... ఒకటీ సాధనం కనపడుతూంది. శాస్తులు ఇంట్లో దాని శిగగోస్ని పాత్రసామాను వొదిలివేసి - సన్నంగా నలుగురుం జారిపోయి తెల్లారగట్ల రెయిలులో విశాఖపట్నం జేరుకుంటే, అక్కడ రుణం చేసుకోవచ్చును. యెవడూ మేలుకుండలేదుగద?

(తలుపు మెల్లగా తీసి వెళ్ళిపోవును)


కొండుభొట్టీయము

తృతీయాంకము

ప్రథమ రంగము

(కేశవరాయుడు గారి చదువు గది. కేశవరాయుడు గారు హెడ్ మేష్టరు - ఇంద్రపట్నం బ్రహ్మ సమాజ కార్యదర్శి - దివాన్ బహద్దర్ రాజారాం గారు - కేశవ రాయుడు గారు ప్రవేశించును.)

కేశవ : బహు కాలానికి. దయచేయ్యండి.

ది.రా : రిటైరయ్నివాళ్లం కామండీ, బ్రతుకు యొక్క సాయం కాలంలో దేవుడికి దేశానికి నౌఖరీ చేయ్యవలెననే అభిలాష కలిగి దైవారాధనా గ్రంథ కాలక్షేపంతో కాలం వెళ్లబుచ్చుచున్నాను. భగవద్గీత ఆచార్యుల వారి వ్యాఖ్యాన సహితంగా ఆంద్రీకరించినాను కద - ఇప్పుడు ఉపనిషత్ భాష్యం తెనిగిస్తున్నాను. నాస్తికం ఇంగ్లీషు చదువుకున్న మన వారిలో యెక్కువగుచున్నది. పెద్దలు చిన్నలు కూడా అప్పటి ఐహికములందు మగ్నచిత్తులయి వుండడమే కాని "What Am I" "కోహం” “నేనెవడను?” నా దేవుని యడల నా యెడల నాతోటి పాటి జంతువుల యడల duty యేమిటి? where am I drifting? నే నేతోవజారుతున్నాను - అనే తలంపులు యేమి పాపమో కాని బుర్రలో జొరబడవు. ఆస్తికులయిన తాము ప్రధానోపాధ్యాయులయి వుండుటను యీ పట్నముల బాలురు మాత్రము యితర పట్నముల వారివలె కాక బుద్ధివంతులుగా నున్నారు.

కేశవ : దయచేత నన్ను పొగడుచున్నారు గాని నేను యెంతటి వాడను. నే చేసేపననగా యెంతటిది?

ది.రా : మీ వంటి సత్పురుషులకు వినయము సదాభూషణమయే వుండును. దేశమున ముందునుండీ యున్న పాపచింతా ఆంగ్లేయ విద్యల వలన కలిగిన నాస్తికతా అనే

గురుజాడలు

500

కొండుభొట్టీయము